PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటర్ల నమోదు ప్రక్రియ జాగ్రత్తగా చేసేలా చర్యలు చేపట్టండి

1 min read

– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్  కర్నూలు : ఓటర్ల నమోదు ప్రక్రియ జాగ్రత్తగా చేసేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో స్పెషల్ సమ్మరీ 2024లో భాగంగా పాణ్యం నియోజకవర్గ బూత్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని  జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్  మాట్లాడుతూ ప్రతి బిఎల్ఓ తనకు కేటాయించిన బూత్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఇంకా ఎంతమంది తమ ఓట్లు నమోదు చేసుకోలేదు వంటి వివరాలు సేకరించుకొని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడానికి సంబంధిత ఫారం 6 నింపి వారిచే సంతకం తీసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఓటరుగా ఉండి స్థానికంగా లేని వారిని గుర్తించాలి. స్థానికంగా లేకపోయినా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినా పట్టణంలోనే వేరే వార్డులోకి మారిపోయిన వారి వివరాలు సేకరించి వారి అనుమతితో సంబంధించిన ఫారం 7 పూర్తి చేసి వారి సంతకాలు లేదా వేలిముద్రలు తీసుకొని ఓటర్ లిస్ట్ నుండి వారిని తొలగించాలి . రెండు శాతం కంటే ఎక్కువ ఓటర్లు తొలగించడానికి ప్రత్యేక అనుమతి అవసరం ఉంటుంది. బిఎల్వోలు ప్రతి నమోదు కార్యక్రమంలో  వ్యక్తి పేరు, ఇంటి నంబరు , వీధి పేరు , గ్రామం పేరు , పోస్ట్ ఆఫీస్ పేరు మొదలగునవి తప్పక ఫారంలో చూపించాలి .ఇల్లు లేని వారిని, ట్రాన్స్ జెండర్స్ , సెక్స్ వర్కర్స్ మరియు 99 సంవత్సరాలు నిండిన వారిని ప్రత్యేకంగా గుర్తించి ఓటర్లుగా నమోదు చేయాలి.ఈ కార్యక్రమంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని  సూచించారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డులు వచ్చాయని పోస్ట్ ఆఫీస్ ద్వారా సంబంధించిన ఓటర్ అడ్రస్ కు త్వరలోనే వస్తాయి అని అన్నారు. 25 సంవత్సరాలు నిండిన వారు క్రొత్తగా ఓటర్ గా నమోదు చేయటానికి వస్తే వారికి వేరే ఏ ప్రదేశంలో కూడా ఓటరుగా నమోదు లేదని వారి దగ్గర నుండి డిక్లరేషన్ తీసుకుని ఓటరుగా నమోదు చేయాలి. నూతనంగా వివాహమైన అమ్మాయి అత్తవారింటికి వచ్చి ఉంటే ఆ అమ్మాయి ఓటరుగా నమోదు కావాలంటే అంతకుముందు ఆమె ఉన్న ప్రదేశంలో ఉన్న ఓటుని తొలగించుకోమని లేదా తొలగించడానికి బిఎల్ఓ చర్యలు చేపట్టాలన్నారు . ఒక వ్యక్తి ఆరు నెలల నుండి ఒక ప్రదేశంలో లేకపోయినట్లయితే ఆ వ్యక్తి ఓటుని  ఫారం 7 మరియు ఫారం 14 లలో నమోదు చేసి రికార్డు తయారు చేసుకుని ఆ వ్యక్తి ఓటుని తొలగించవచ్చు అన్నారు. గోరుకల్లు ప్రాజెక్టు నిర్వాసితులు సుగాలి మిట్ట గ్రామ పంచాయతీలో నివాసం ఉన్నందున వారిని ఫారం 8 ద్వారా ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. మీకు ఓటరు విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఈవో ఏపీ వెబ్సైట్ లో వారి ఇంటి పూర్తి పేరు నమోదు చేసి అక్కడ వారికి ఓటు హక్కు ఉన్నదా లేదా అని నిర్ధారణ చేసుకోవచ్చన్నారు. బి ఎల్ ఓ లు తమ పోలింగ్ స్టేషన్ ను సందర్శించి అక్కడ  ర్యాంపు , బల్లలు, కుర్చీలు , వెలుతురు, కరెంటు, నీరు మొదలగు సాధారణ వసతులు ఉన్నాయా లేదా అని ధ్రువీకరించుకొని సంబంధిత ఏ ఈ ఆర్ ఓ లకు సమాచారము ఇచ్చి కావలసిన వసతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒక పోలింగ్ బూత్ లో 1500 ఓటర్లు మాత్రమే ఉండాలన్నారు .అర్బన్ లో అయినా రూరల్ లో అయినా 1500 కంటే ఎక్కువ ఉంటే ఆ విషయాన్ని ఏఈఆర్వోలు దగ్గరికి తీసుకువచ్చి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మరొక పోలింగ్ బూత్ లో వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు. కావున  ఈ విషయాన్ని  పరిశీలించుకోవాల్సిందిగా బిఎల్వోలకు సూచించారు.ఈఆర్వో, జిల్లా పరిషత్ సీఈవో  నాసర రెడ్డి  మాట్లాడుతూ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావించాలన్నారు. ఎన్నికల విధులు సహృదయంతో నిర్వర్తించి జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ గారికి  మంచి పేరు తీసుకుని రావాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల నమోదు మరియు ఆ ప్రదేశంలో ఉండని ఓటర్లను తొలగించడం వంటి ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో  ఓర్వకల్లు ,కల్లూరు ,గడివేముల , పాణ్యం ఏఈఆర్వోలు/తహసిల్దారులు, కల్లూరు తహసిల్డార్ రమేష్, ఎన్నికల సూపర్డెంట్ మురళి, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.

About Author