PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తట్టు,రుబెల్లా నివారణకు చర్యలు తీసుకోండి

1 min read

వైద్యాధికారులతో సమీక్షించిన కలెక్టర్​ జి. సృజన

పల్లెవెలుగు, కర్నూలు: ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వెళ్లినప్పుడు  తట్టు (మీజిల్స్), కందిన ఎరుపు రంగు పొక్కులు(రుబెల్లా) వ్యాధులను గుర్తించి, జిల్లాలో వాటి నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా జి సృజన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో తట్టు (మీజిల్స్ ), రుబెల్లా  నిర్మూలనపై   జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం  జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో  తట్టు (మీజిల్స్), కందిన ఎరుపు రంగు పొక్కులు(రుబెల్లా) డిసెంబర్ 2023 నాటికి నిర్మూలించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తట్టు (మీజిల్స్), కందిన ఎరుపు రంగు పొక్కులు(రుబెల్లా) 9 నెలల నుండి 12 నెలల లోపల ఉన్న పిల్లలకు 98 శాతం మొదటి వ్యాక్సిన్ ఇచ్చారని, 16 నెలల నుండి 24 నెలల లోపల ఉన్న పిల్లలకు 84 శాతం రెండవ వ్యాక్సిన్ ఇచ్చారని అయితే అర్బన్ ప్రాంతాల్లో మాత్రం పురోగతి  చాలా తక్కువగా ఉందన్నారు.. కేవలం ఈ అంశంలోనే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఏఎన్ఎం ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ అంశంలో కూడా అర్బన్ ప్రాంతాల్లో తక్కువ పురోగతి ఉంటోందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ప్రజలలో  ర్యాలీల ద్వారా, ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా అవగాహన కల్పించి  వ్యాక్సినేషన్ లో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎమ్ హెచ్ఓ ని అదేశించారు. జ్వరం, రాష్ కు సంబందించి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 62 కేసులు రాగా, ఇందులో 19 కేసులు పాజిటివ్ తట్టు (మీజిల్స్)గా నమోదు అయినాయని, పాజిటివ్ గా వచ్చిన కేసుల చుట్టు ప్రక్కల 100 ఇళ్లకు కూడా జ్వరం, రాష్  పరీక్షలు నిర్వహించడం జరిగిందని  కలెక్టర్ దృష్టికి WHO సర్వెలియన్స్ మెడికల్ ఆఫీసర్  డా.భవాని కలెక్టర్ కు వివరించారు..  పిహెచ్ సి, సిహెచ్ సి కేంద్రాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం అమలు చేస్తున్నపుడు ఈ కేసులను ఎందుకు ముందుగానే గుర్తించడం లేదు అని కలెక్టర్ DMHO  ను ప్రశ్నించారు.. జ్వరం, రాష్ తో ఉన్న ప్రజలను, నార్కోటిక్ డ్రగ్స్ ఉపయోగించే ప్రజలను  ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వెళ్లినప్పుడు గుర్తించాలని మెడికల్ ఆఫీసర్ లకు చెప్పాలని DMHO కు సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం కంటి తుడుపు చర్యలా చేయకూడదన్నారు.. ఇలాంటి రోగాలను గుర్తించి, నిర్మూలనకు తోడ్పడాలని  సూచించారు.. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటి ఇంటికి వెళ్లినప్పుడు వెళ్లినప్పుడు అనుమానాస్పద కేసులను డాక్టర్ల దృష్టికి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో, అంగన్వాడి  స్కూల్స్ లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లలో ఐసిడిఎస్ పిడి, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ..   అదే విధంగా ఏ శాఖ ఎటువంటి విధులు నిర్వహించాలని దానిపైన నివేదిక రూపొందించాలని మెడికల్ ఆఫీసర్ ని ఆదేశించారు.

వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష

గత సమావేశంలో   నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్,  కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్ ఈ వారం కేవలం 13 319 మాత్రమే చేశారన్నారు..  ప్రతి ఏఎన్ఎంకు 5 చొప్పున స్క్రీనింగ్ చేయాలని గతంలోనే చెప్పామన్నారు..ఆ విధంగా జిల్లాలో ఉన్న 600  ANM లు  చేస్తే 30000 అవుతుందని, కొంత మార్జిన్ వదిలితే కనీసం 25 తంగా చేయాలని కలెక్టర్ డి ఎం హెచ్ ఓ ను ఆదేశించారు వచ్చే మంగళవారం నాటికి ప్రతి ఏఎన్ఎం 5 చొప్పున చేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.  త్వరలో పాఠశాలలు కళాశాలలు ప్రారంభం కానున్నాయని, అనీమియా పర్యవేక్షణకు సంబంధించి ఇకపై తప్పులు జరగకూడదని, మిషన్స్ లో ఎర్రర్స్ రాకుండా ముందుగానే టెస్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  రాష్ట్ర ప్రభుత్వం పిహెచ్ సి, సిహెచ్ సి, ఏరియా ఆసుపత్రిలో అన్ని మౌలిక వసతులు అధునాతన పరికరాలు ఇచ్చినప్పటికీ కూడా  ప్రైవేట్ ఆస్పత్రులలోనూ , ఆరోగ్యశ్రీ కింద ఎందుకు డెలివరీలు  చేయించుకుంటున్నారని కలెక్టర్ ప్రశ్నించారు.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కూడా కాన్పులు తగ్గుతున్నాయని ఈ అంశం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వైద్యశాల అధికారులను ఆదేశించారు. ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం కలిగించే విధంగా డాక్టర్లు పని చేయాలని సూచించారు. ఏఎన్ఎం ల పరిధిలో ఎన్ని కేసులు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళుతున్నాయి, ఎన్ని కేసులు ప్రభుత్వాసుపత్రికి వెళుతున్నాయన్న వివరాలను సేకరించాలని సూచించారు.. ఏరియా ఆస్పత్రుల్లో, ప్రభుత్వ  సర్వజన వైద్యశాలలో వారం లోపు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఎంట్రీ, ఎగ్జిట్ రికార్డ్ అయ్యేలా చూడాలని డిసిహెచ్ఎస్ ను, సూపరిoటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎమ్ హెచ్ఓ డా .రామ గిడ్డయ్య ,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవాని, డి సి హెచ్ ఎస్ శ్రీనివాసరావు, ఆదోని డిప్యూటీ డిఎంహెచ్వో సత్యవతి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు.

About Author