PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి…

1 min read

హెల్త్ సూపర్వైజర్ సీతారాములమ్మ

1. అంగన్వాడి కేంద్రంలో ప్రదర్శించిన ఆకుకూరలు,కాయగూరలు, చిరుధాన్యాలు, గుడ్లు,పాలు, పలు వంటకాలు…..

2. పలువురిని ఆకర్షించిన ఐసీడీఎస్ తల్లి బిడ్డ లోగో….

3. వైయస్సార్ కిట్స్, బాలామృతం,గుడ్లు,పాలు, టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేసిన 16వ వార్డు మెంబర్ షరీఫ్, వార్డు పెద్దలు గౌస్ మొహిద్దిన్, సయ్యద్ భాష, ఇస్మాయిల్.

పల్లెవెలుగు వెబ్  చాగలమర్రి :  పోషక విలువలు ఉండే ఆహారమును గర్భిణీలు బాలింతలు తీసుకోవాలని చాగలమర్రి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల హెల్త్ సూపర్వైజర్ సీతారాములమ్మ తెలిపారు. శుక్రవారం చాలమర్రిలోని 17 అంగన్వాడి కేంద్రంలో  టీచర్ చంద్రకళ, 12వ అంగన్వాడి కేంద్రం టీచర్ ఇందుమతి, చాగలమ్మ చెంచుకాలని మినీ అంగన్వాడీ టీచర్   సుజాత ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సిడిపిఓ ఆదేశాల మేరకు పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్లు అంగన్వాడి కేంద్రంలో వేసిన ఐసిడిఎస్ తల్లి బిడ్డ లోగో ఉప్పులో రంగులు చల్లి వేసిన చిత్రం పలువురిని ఆకర్షించాయి. అనంతరం ఆకుకూరలు కాయగూరలు చిరుధాన్యాలు పౌష్టికాహార సమతుల్య ఆహార పదార్థాలను అంగన్వాడి కేంద్రంలో ప్రదర్శించి వాటి పోషక విలువలు గురించి గర్భిణీ బాలింతలకు తెలియజేశారు. అనంతరం మండల హెల్త్ సూపర్వైజర్ సీతారాములమ్మ మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల లోపం, బరువు తక్కువగా ఉన్న చిన్నారులపై  ప్రత్యేక శ్రద్ధ సాధించాలన్నారు. గర్భవతులు,బాలింతలు, పాలిచ్చే తల్లులకు ఎటువంటి రక్తహీనత లేకుండా ఐరన్ సప్లిమెంట్స్, ఐరన్ సుక్రో అందజేస్తున్నామని వైద్యాధికారులచే వైద్య ఆరోగ్య సలహాలు పాటించాలన్నారు. రక్తహీనత వల్ల మాతృ మరణాలు, శిశు మరణాలు సంభవిస్తాయని, రక్తహీనతను అధిగమించేందుకు పౌష్టికాహారంతో పాటు పలు సలహాలు సూచనలు పొందాలన్నారు. బాల్య వివాహాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు అందజేస్తున్నామని వాటిని వినియోగించుకోవాలని కోరారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. కాయగూరలు పండ్లు, అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అంగన్వాడి  కేంద్రంలో పిల్లలను చేర్పించాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమాల ద్వారా పిల్లలు శారీరక పరిపుష్టితోపాటు, ధారాళంగా  మాట్లాడేందుకు, మానసిక అభివృద్ధి చెందుటకు అంగన్వాడీ కేంద్రాలులు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శిపర్వీన్,ఆరోగ్య కార్యకర్త మాధవి,ఆశా కార్యకర్తలు శివలక్ష్మి సౌభాగ్య, అంగన్వాడి సహాయకురాలు సుజాత, అంగన్వాడి పరిధిలోని  గర్భిణీ బాలింతలు, వార్డ్ సభ్యులు  షరీఫ్,   ఇస్మాయిల్,గౌస్ మొహిద్దీన్, సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

About Author