గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టండి
1 min read– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల పురోగతి, ఆరోగ్యం, విద్య, ఆడుదాం ఆంధ్ర తదితర అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ రాజ్ కు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు సంబంధించిన పనులను ఇచ్చిన గడువు లోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో త్వరితగతిన పనులు చేయించేలా చూడాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పూర్తైన భవనాలలో గ్రామ సచివాలయలు అయితే ఎంపిడిఓ లకు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు అయితే పి హెచ్ సి లోని మెడికల్ ఆఫీసర్ కు, రైతు భరోసా కేంద్రాలు అయితే మండల వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించాలని వారికి అప్పగించిన తర్వాత వారి నుండి హ్యాండెడ్ ఓవర్ సర్టిఫికెట్ తప్పకుండా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లకు సూచించారు.’ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ విధానంలో ప్రతి జిల్లా నుండి కనీసం ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తించి అందుకు సంబంధించిన డాక్యుమెంటరీ తయారు చేసి పంపించమని చెప్పడం జరిగిందని అయితే కొన్ని జిల్లాలు ఇంకా పంపించలేదని పెండింగ్లో ఉన్న జిల్లాలు కూడా వారి జిల్లాలో ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తించి సంబంధించిన డాక్యుమెంటరీ తయారు చేసి త్వరితగతిన పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి నాణ్యమైన రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరు సంవత్సరాల వయసు లోపు బరువు తక్కువ ఉన్న పిల్లలు, స్టంటేడ్ పిల్లలు అంగన్వాడి కేంద్రాలకు వచ్చి పోషకాహారం తీసుకోకుండా ఉన్నట్లయితే అటువంటి వారి ఇంటికి ఆశ వర్కర్లు, ఎఎన్ఎమ్ లు, అంగన్వాడి హెల్పర్లు, మహిళా పోలీస్ వెళ్లి ఆ పిల్లవాడిని అంగన్వాడీ కేంద్రానికి తీసుకొని వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల కింద గర్భిణులు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ కిట్ లు ఆగస్టు ఒకటవ తేదీ నుండి పంపిణీ చేయబోతున్నామని అందుకు సంబంధించిన కిట్లు నాణ్యతతో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి అక్టోబరు నుండి సచివాలయాల వారీగా క్రికెట్, వాలీ బాల్, కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నారు. ఈ క్రీడలలో పాల్గొనడానికి 17 సంవత్సరాల పైబడి ఉండాలని, ఈ క్రీడలను గ్రామ/వార్డు సచివాలయం, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఐదు విభాగాలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడలను 46 రోజుల వరకు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు.అక్టోబర్ మాసంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.వైద్యానికి సంబంధించి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వేలో పురోగతి సాధించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కి సంబంధించి స్క్రీనింగ్ చేసి రక్తహీనతతో ఉన్న గర్భవతులను గుర్తించిన తర్వాత వారికి తగిన ట్రీట్మెంట్ ఫ్యామిలీ డాక్టర్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్లో ఉన్న స్క్రీనింగ్ కేసులను కూడా ఈ నెల చివరినాటికి పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భవతుల డెలివరీ శాతాన్ని పెంచే విధంగా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అర్బన్ ప్రాంతాల నుండి డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని అందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఏఎన్ఎమ్ లు నీటి నిల్వ ఉన్న ప్రదేశాలు శానిటేషన్ సరిగ్గా లేని ప్రదేశాలను ఫోటోలు తీసి వెక్టార్ కంట్రోల్ హైజిన్ యాప్ నందు అప్లోడ్ చేసిన వాటిని పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ అధికారులు త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాడు నేడు కింద నిర్మిస్తున్న పీహెచ్సీ సెంటర్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. యుపిహెచ్సి సెంటర్లను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలన్నారు. ఎన్హెచ్ఎం నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.విద్యా శాఖకి సంబంధించి వాలంటీర్ల ద్వారా 5 నుండి 18 ఏళ్ల విద్యార్థుల సర్వేని నాణ్యతతో చేయించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ప్రక్రియ బుధవారం నాటికి పూర్తి చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. సిస్టం డ్రాప్ ఔట్ పిల్లలను, స్కూల్ డ్రాప్ ఔట్ పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాడు నేడు క్రింద చేపడుతున్న అదనపు తరగతి గదుల పనులను, పెయింటింగ్, త్రాగు నీరు , చిన్న చిన్న మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు ఏదైనా పాఠశాలను తనిఖీ చేస్తున్న సమయంలో తగిన ఫర్నిచర్ లేకపోతే అటువంటి సమస్యను తమ దృష్టికి తీసుకొని వస్తే అటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.