PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిర్దేశించిన గడువు లోపు గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టండి

1 min read

– అక్టోబర్ 31వ తేది నాటికి అన్ని గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టండి

– నవంబరు 30వ తేది నాటికి ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టండి

– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్  కర్నూలు : రీ సర్వే కి సంబంధించి ఫేస్ 3 కింద కేటాయించిన  అన్ని గ్రామాల్లో అక్టోబర్ 31వ తేది నాటికి గ్రౌండ్ ట్రూతింగ్ చేయడంతో పాటు  నవంబరు 30వ తేది నాటికి ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రీసర్వే అంశంపై కర్నూలు, పత్తికొండ డివిజన్ మండలాల తహశీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే కి సంబంధించి ఫేస్ 3 కింద కేటాయించిన  అన్ని గ్రామాల్లో అక్టోబర్ 31వ తేది నాటికి గ్రౌండ్ ట్రూతింగ్ చేయడంతో పాటు నవంబర్ 30వ తేదీ నాటికి సంబంధించిన ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రీ సర్వే మీద జాయింట్ కలెక్టర్ తీసుకుంటున్న దృష్టి డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, సర్వే అధికారులు తీసుకోవడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు… ఇతర జిల్లాలో కూడా హౌసింగ్, జగనన్న సురక్ష తదితర కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ రీ సర్వే లో కూడా పురోగతి సాధిస్తున్నారని కానీ మన జిల్లాలో మాత్రం  పురోగతి లో వెనుకబడి ఉన్నామన్నారు..   నిర్దేశించిన  గడువు లోపు  బాధ్యతగా విధులు నిర్వహించి లక్ష్యాలను సాధించాలన్నారు.  కర్నూల్ డివిజన్ లోని  గ్రౌండ్ ట్రూతింగ్ మొదలుపెట్టని గ్రామాలకు రోవర్ లను కేటాయించకుండా నిరుపయోగంగా పెట్టినందుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే కి ఛార్జ్ మెమో జారీ చేయాలని ఎడి సర్వే ని కలెక్టర్ ఆదేశించారు.  అదే విధంగా గూడూరు మండలం మల్లాపురం గ్రామ సర్వేయర్ అతనికి కేటాయించిన విధులను పూర్తి చేయకుండా నిర్లక్ష్య ధోరణి వహించినందుకు  చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ పత్తికొండ డివిజన్ కు సంబంధించి ఫేజ్-3లో 49 గ్రామాలు, కర్నూలు డివిజన్ కు 51 గ్రామాలు కేటాయించడం జరిగిందని, వీటి ఫైనల్ ఆర్ఓఅర్ నవంబర్ 30వ తేది నాటికి పూర్తి చేయాలన్నారు. విస్తీర్ణంను బట్టి అదనపు రోవర్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 31వ తేది నాటికి గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి కావాలన్నారు.  విఆర్ఓలు, సర్వేయర్లు సమన్వయంతో రీసర్వే పనిని పూర్తి చేయాలన్నారు. రీసర్వే చేస్తున్నామని ముందుగా రైతులకు నోటీసుల ద్వారా తెలపాలన్నారు. అనంతరం గ్రామ సభ నిర్వహించాలన్నారు. రోవర్ ను గ్రాండ్ ట్రూతింగ్ కు తప్పనిసరిగా వినియోగించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల హద్దులను బ్లర్ గా ఉన్న ప్రాంతాలన్నీ గుర్తించడానికి రోవర్స్ ను వినియోగించుకోవాలన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ కు వెళ్ళినప్పుడు ముందుగా సరిహద్దులను  నిర్ధారించడంతో పాటు రైతుల పూర్తి వివరాలను ఫోటోతో సహా విఆర్ఓ సేకరించాలన్నారు. గ్రాండ్ ట్రూతింగ్ కు సంబంధించి డేటా ప్రాసెసింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వాటికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఇంఛార్జిగా ఉంటారన్నారు. గ్రాండ్ ట్రూతింగ్ లో ఏ సమస్యలు వచ్చిన ఇక్కడే పరిష్కరించాలన్నారు, అదేవిధంగా సర్వేయర్లకు ఏ విధంగా షేప్ ఫైల్స్ చేయాలో అనేదానిపై ఇక్కడే శిక్షణ ఇవ్వాలన్నారు. ఎల్పిఎం జనరేషన్ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలని అలా కాకుండా మండల సర్వేయర్లు ఎక్కువ రోజులు తీసుకుంటున్నారని, అలా కాకుండా సరైన సమయంలో పూర్తి చేసేలా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. విఎస్ లాగిన్ 9(2) నోటీసులు జనరేట్ చేసి రైతులకు ఇచ్చి గ్రౌండ్ ట్రుతింగ్ పూర్తిచేసి సదరు వివరాలతో కూడిన నోటీసును కొట్టివేతలు లేకుండా వారికి అందజేయాలన్నారు. వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 10(2), సెక్షన్ 11 ద్వారా స్వీకరించాలన్నారు. రీ సర్వే డీటీలు తప్పనిసరిగా అప్పీల్స్ స్వీకరించి డిస్పోస్ చేయడంతో పాటు స్పీకింగ్ ఆర్డర్స్ ను కూడా వారికి అందజేయాలన్నారు. గ్రాండ్ ట్రుతుంగ్ రోజుకు ఒక రోవర్ తో 100 ఎకరాలు, ఎల్పిఎం జనరేషన్ కు 3 రోజులు, విఎస్/విఆర్ఓ లాగిన్ లో 5 రోజులు, ఎంఆర్ఓ లాగిన్ లో 17 రోజులు, ఆర్డీఓ లాగిన్ లో 2 రోజులు, జాయింట్ కలెక్టర్ లాగిన్ లో 3 రోజుల లోపు పూర్తి చేసేలా నిర్దేశిత గడువును అందరికీ జాయింట్ కలెక్టర్ వివరించారు. సమావేశంలో కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, పత్తికొండ ఆర్డీఓ మోహన్ దాస్, సర్వేయర్ ఎడి మణికన్నన్, విజయ సారథి, కర్నూలు, పత్తికొండ డివిజన్ మండలాల తహశీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్ల తదితరులు పాల్గొన్నారు.

About Author