PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాక్ డ్రిల్ ను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టండి

1 min read

డిఆర్ఓ మధుసూదన రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ నెల 7వ తేదిన కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో టి జి వి శ్రీ రాయలసీమ అల్కలీస్  & అలైడ్ కెమికల్స్ లిమిటెడ్  ఫ్యాక్టరీ లో నిర్వహించనున్న రసాయన విపత్తు మాక్ డ్రిల్ ను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని డిఆర్ఓ మధుసూదన రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈ నెల 7 వ తేదీ కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో టి జి వి శ్రీ రాయలసీమ అల్కలీస్  & అలైడ్ కెమికల్స్ లిమిటెడ్  ఫ్యాక్టరీ లో నిర్వహించనున్న రసాయన విపత్తు మాక్ డ్రిల్ కి సంబంధించి తీసుకోవాల్సిన అత్యవసర భద్రతా చర్యలపై సంబంధిత అధికారులతో  డిఆర్ఓ మధుసూధన రావు సమీక్ష  నిర్వహించారు.ఈ సందర్భంగా డి ఆర్ ఓ  మాట్లాడుతూ అనుకోని పరిస్థితులలో పరిశ్రమల్లో రసాయన విపత్తుల ప్రమాదాలు సంభవించినప్పుడు విపత్తును ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద మార్చి నెల 7 వ తేదీ కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో టి జి వి శ్రీ రాయలసీమ అల్కలీస్  & అలైడ్ కెమికల్స్ లిమిటెడ్  ఫ్యాక్టరీ లో  క్లోరిన్ వాయువు లీక్ అయితే సంభవించే అత్యవసర పరిస్థితుల మీద మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు మాక్ డ్రిల్ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. మాక్ డ్రిల్ ప్రక్రియకు కర్నూల్ రెవెన్యూ డివిజనల్ అధికారిని నోడల్ అధికారిగా, ఇన్సిడెంట్ కమాండర్ గా నియమించారని డిఆర్ఓ పేర్కొన్నారు.  డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ లో విధులు నిర్వహించనున్న అధికారులు అందరూ వారికి కేటాయించిన విధులను అప్రమత్తంగా,  బాధ్యతతో నిర్వహించి మాక్ డ్రిల్ నవిజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు డి ఆర్ ఓ సూచించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రమంతటా అన్ని జిల్లాలలో మార్చి 7వ తేదీన రసాయన విపత్తు మీద మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా కర్నూలు జిల్లాలో కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో టి జి వి శ్రీ రాయలసీమ అల్కలీస్  & అలైడ్ కెమికల్స్ లిమిటెడ్  ఫ్యాక్టరీ లో క్లోరిన్ వాయువు లీక్ అయితే సంభవించే అత్యవసర పరిస్థితుల మీద  మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రసాయన విపత్తులు సంభవించిన అత్యవసర పరిస్థితులలో వివిధ శాఖలు వారు నిర్వర్తించాల్సిన విధులు, చేసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఇటువంటి విపత్తులు ఏర్పడినప్పుడు మొదటిగా స్పందించేవారు  ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ వారని ఇటువంటి సమయంలో వారు మొదటిగా బాధితులు ఎవరైతే చిక్కుకొని ఉంటారో వారిని కాపాడాల్సి ఉంటుందని అటువంటి సమయంలో కాపాడడానికి వెళ్లే సిబ్బంది విష వాయువు కాబట్టి వ్యక్తిగత రక్షణ పరికరాలతో, సెల్ఫ్ కంటైండ్ బ్రీతింగ్ అపారటస్ లను ఉపయోగించి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని  సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదే విధంగా అత్యవసర పరికరాలు మరిన్ని అవసరమైనప్పుడు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని  టి జి వి శ్రీ రాయలసీమ అల్కలీస్  & అలైడ్ కెమికల్స్ లిమిటెడ్  ఫ్యాక్టరీ వారిని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు కోరారు.  వైద్యానికి సంబంధించి మాక్ డ్రిల్ నిర్వహించే  ప్రదేశంలో వైద్య పరికరాలతో పాటు క్లోరిన్ రసాయన విపత్తు మీద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నందున ఆక్సిజన్ సిలిండర్లు, శ్వాస పరికరాలు కూడా మెడికల్ ఎయిడ్ రూమ్ ఏర్పాటు చేయించి  అందులో 10 బెడ్లు, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో ను అదేశించారు. మాక్ డ్రిల్ నిర్వహించే ప్రదేశంలో పరిసరాల్లో ఉండే ప్రజలను ఖాళీ చేయించి రిలీవ్ క్యాంప్ కు చేర్చినప్పుడు రిలీవ్ క్యాంప్ లో కూడా ఒక డాక్టర్, నర్సింగ్ స్టాఫ్ ఉండాలని అదే విధంగా  ప్రజలు క్లోరిన్ గ్యాస్ కి ఏమైనా ప్రభావితం అయ్యారా లేదా చెక్ చేయుటకు ఒక టీమును ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మాక్ డ్రిల్ నిర్వహించే  ప్రదేశంలో 4 నుండి 5 అంబులెన్స్ లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని 108 అంబులెన్స్ మేనేజర్ ను అదేశించారు. మాక్ డ్రిల్ నిర్వహించే ప్రదేశంలో పరిసరాల్లో ఉండే ఈ.తాండ్రపాడు లోని కొంతమంది ప్రజలను  ఖాళీ చేయించి మాంటేస్సోరి  ఒలంపియాడ్ స్కూల్  లో ఏర్పాటు చేయనున్న రిలీవ్ క్యాంప్ కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఇది కేవలం  మాక్ డ్రిల్ కోసం నిర్వహిస్తున్నామని ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన  అవసరం లేదనే విషయాన్ని కూడా ప్రజలకు ఒక్క రోజు ముందుగానే  ప్రజలకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత కర్నూలు ఆర్ డి ఓ, తహసిల్దార్, ఎంపీడీపీలకు సూచించారు. మాంటేస్సోరి  ఒలంపియాడ్ స్కూల్  లో ఏర్పాటు చేయనున్న రిలీవ్ క్యాంప్ లో బెడ్స్, శానిటేషన్, స్నాక్స్, వాష్రూమ్స్, త్రాగునీరు, భోజనాలు  ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్లోరిన్ గ్యాస్ లీకైన తర్వాత చుట్టూ ప్రక్కన  ప్రాంతాలలో గాలి మరియు నీరు ఏమైనా కలుషితం అయ్యిందా  వాటి వల్ల రానున్న రోజుల్లో ఏవైనా సమస్యలు రానున్నాయా అనే ధోరణిలో గాలి మరియు నీరును క్వాలిటీ చెక్ చేసి నివేదికలు కలెక్టర్ కి సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ వారు క్లోరిన్ గ్యాస్ లీకైన తర్వాత పరిసరాల ప్రాంతాలలో పంటలు ఏమైనా దెబ్బతిన్నాయా అని పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు.పశుసంవర్ధక శాఖ వారు క్లోరిన్ గ్యాస్ లీకైన తర్వాత పరిసరాల ప్రాంతాలలో పశువులకు  ఏమైనా హాని కలిగిందా  అని పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు.మాక్ డ్రిల్ నిర్వహించే ప్రదేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చూడడం, ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అదే విధంగా పరిసరాలలో ఉన్న ప్రజలను రిలీవ్ క్యాంపుకు తరలించినప్పుడు వారి యొక్క ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మాక్ డ్రిల్ నిర్వహించే ప్రదేశంలో  పరిస్థితులను బట్టి కరెంట్ ఆన్, ఆఫ్ లో   ఉండే విధంగా చూసుకోవాలన్నారు. మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి కేవలం మాక్ డ్రిల్ నిర్వహణ మాత్రమే అని 6వ తేదీన పత్రికా ప్రకటన ప్రచురణ చేసే విధంగా చూడాలని సమాచార శాఖ ఉప సంచాలకులు వారిని కోరారు.  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు మాంటేస్సోరి  ఒలంపియాడ్ స్కూల్  లో ఏర్పాటు చేయనున్న రిలీవ్ క్యాంప్ కి ప్రజలను చేరవేయడానికి బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.రిలీవ్ క్యాంప్ లో ప్రజలు ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం వస్తే వారికి రేషన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ వారిని ఆదేశించారు. మాక్ డ్రిల్ నిర్వహించే ప్రదేశంలో క్లోరిన్ గ్యాస్ లీక్ అయిన తర్వాత పరిసరాల్లో ఉండే ప్రజల త్రాగునీరు, ఫుడ్ ఏమైనా కలుషితం అయ్యిందా అని పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఫుడ్ కంట్రోల్ బోర్డ్ వారిని ఆదేశించారు. విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 5 వ తేదీన ఉదయం 10 గంటలకు టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ఉంటుందని సంబంధిత అధికారులు తప్పకుండా హాజరు అవ్వాలని సూచించారు. సమావేశంలో కర్నూలు ఆర్డీఓ శేషి రెడ్డి, డిటిసి శ్రీధర్ , డిపిఓ అనుపమ, తదితరులు పాల్గొన్నారు.

About Author