పెండింగ్ ఫార్మ్స్ డిస్పోజ్ చేసేలా చర్యలు చేపట్టండి
1 min readపాణ్యం నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మరియు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : పెండింగ్ ఫార్మ్స్ త్వరితగతిన డిస్పోజ్ చేసేలా చర్యలు చేపట్టాలని పాణ్యం నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మరియు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఏఈఆర్ఓలను ఆదేశించారు.శనివారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పాణ్యం నియోజకవర్గ రాజకీయ పార్టీ ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్-2024పై పాణ్యం నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి మరియు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మరియు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఫార్మ్స్ 6, 7, 8 నందు వచ్చిన క్లెయిమ్స్ ను కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలపాలన్నారు. ఎక్కడైనా నూతన పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో రెండు శాతం కంటే ఎక్కువ ఆడిషన్స్ చేసిన వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. ఫార్మ్ 6 పరిశీలనకు సంబంధించి దరఖాస్తుదారుని చిరునామా కోసం ఆధార్ కార్డ్, వయసు నిర్ధారణ కోసం పదవ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ ను, ఫార్మ్ 7 కు సంబంధించి ఓటర్ చనిపోయి ఉంటే తప్పనిసరిగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడంతో పాటు, డెత్ సర్టిఫికెట్ లేకపోతే ఇరుగుపొరుగు వారితో వివరాలు సేకరించి పంచనామా సిద్ధం చేసుకోవాలన్నారు, ఫార్మ్ 8 ద్వారా దరఖాసుదారుడు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే అందుకు తగిన జత చేయాలన్నారు.వైఎస్సార్ సిపి పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ కొంత మంది బిఎల్ఓలు పూర్తి స్థాయిలో పరిశీలించకుండా జాబితా నుండి తొలగిస్తున్నారని తెలుపగా, జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ అలా జరిగే అవకాశం లేదని ప్రతి ఒక్క డిలిషన్ ను కూడా పరిశీలించడం జరుగుతుందన్నారు.సమావేశంలోవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి హనుమంత్ రెడ్డి, సురేష్, కల్లూరు తహశీల్దార్ రమేష్ బాబు, ఓర్వకల్లు తహశీల్దార్ శివ రాముడు తదితరులు పాల్గొన్నారు.