సర్వే 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టండి
1 min read– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వాలంటీర్ల ద్వారా 5 నుండి 18 ఏళ్ల విద్యార్థుల సర్వే 100 శాతం చేయించడంతో పాటు మండల విద్యాశాఖ అధికారుల సమన్వయంతో పిల్లలను పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ చేయించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లో కూడా 100 శాతం సాధించే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపిడిఓలను, మునిసిపల్ కమిషనర్ లను కలెక్టర్ ఆదేశించారు.మంగళవారం ఉదయం స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీర్లతో హౌసింగ్, ఉపాధి హామీ పథకం అమలు, ప్రభుత్వ ప్రయారిటీ భవనల నిర్మాణాలు, జగనన్న సురక్ష, విద్యాశాఖ అంశాల పై జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ కి సంబంధించి వాలంటీర్ల ద్వారా 5 నుండి 18 ఏళ్ల విద్యార్థుల సర్వే 95 శాతం పూర్తి చేశారని త్వరితగతిన 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సర్వే చేయించడంతో పాటు మండల విద్యాశాఖ అధికారుల సమన్వయంతో పిల్లలను పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ చేయించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లో కూడా 100 శాతం సాధించాలని ముఖ్యంగా ఎమ్మిగనూరు, కల్లూరు, పత్తికొండ, గూడూరు మండలాలలో ఒక్క వాలంటీర్ కూడా 100 శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధించలేదని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కి సంబంధించి జూలై 30 చివరి తేదీ అని మండల విద్యాశాఖ అధికారులతో , వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించుకుని యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని వాలంటీర్లతో శనివారం నాటికి పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ లను, ఎంపీడీవోలను ఆదేశించారు. సిస్టం డ్రాప్ ఔట్ పిల్లలను, బడి బయట పిల్లలను పాఠశాలల చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.హౌసింగ్ కి సంబంధించి సాధించాల్సిన లక్ష్యాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బిలో బేస్మెంట్ లెవెల్ నుండి బేస్మెంట్ లెవెల్ స్థాయికి జీరో పురోగతి సాధించడం ఏంటని వెల్దుర్తి, ఆదోని, పెద్దకడబూరు, కర్నూలు మండలాల ఎంపీడీవో లను కలెక్టర్ ప్రశ్నించారు, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా బేస్మెంట్ లెవెల్ స్థాయి నుండి కంప్లీషన్ స్థాయికి జీరో పురోగతి సాధించిన కౌతాళం, హాలహర్వి, ఆదోని అర్బన్, కర్నూల్ మండలాల హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లతో మాట్లాడుతూ సాధించాల్సిన లక్ష్యాలు ఎక్కువ ఉన్నపటికీ కూడా జీరో పురోగతి సాధించడం ఏంటని పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా కర్నూల్ మండలం అటు బిలో బేస్మెంట్ స్థాయి నుండి బేస్మెంట్ లెవల్ స్థాయికి, బేస్మెంట్ లెవల్ స్థాయి నుండి కంప్లిషన్ స్థాయిలో రెండిట్లోను జీరో పురోగతి సాధించారని మరల జీరో పురోగతి ఉన్నట్లయితే తగిన చర్యలు తప్పవన్నారు. కంప్లీషన్ స్థాయిలో ఉన్న ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి గోనెగండ్ల, ఓర్వకల్లు, వెల్దుర్తి మండలాలు పురోగతి కనపరచడం లేదని పురోగతి సాధించాలన్నారు. ఈ నెల 3 నుండి 16 వరకు 88 సచివాలయాలలు జీరో పురోగతి నమోదు చేశారని ముఖ్యంగా నందవరం, హాలహర్వి మండలాలలోని నాగులదిన్నె, లద్దగిరి సచివాలయాల్లో గత రెండు వారాల నుండి జీరో పురోగతిలోనే ఉన్నారని సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ల మీద తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షలు నిర్వహించి పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు సంబంధించి పురోగతి సాధించని చిప్పగిరి, హోలగుంద, తుగ్గలి, ఆదోని, ఓర్వకల్లు మండలాల ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణంలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎవరైనా కాంట్రాక్టర్ రెండు రోజులలో పనులు మొదలు పెట్టకుంటే అటువంటి వారి వివరాలను పంపించాలని సంబంధిత ఎంపిడిఓ లను, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఉపాధి హామీ పనులకు సంబంధించి లేబర్ మొబిలైజేషన్లో ఎమ్మిగనూరు, సి.బెళగల్, పెద్దకడుబూరు,మంత్రాలయం మండలాలు తక్కువ మొబిలైజేషన్ చేశారని పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. జగనన్న సురక్షకు సంబంధించి సర్వీసెస్ జనరేట్ చేయడంలో కర్నూలు అర్బన్,కౌతాళం, క్రిష్ణగిరి, గొనెగండ్ల మండలాలు చాలా వెనుకబడి ఉన్నారని సర్వీసెస్ జనరేట్ చేయడంలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండలాల ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. వాలంటీర్ హౌస్ హోల్డ్ సర్వేలో కూడా 73 శాతం చేశారని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ లను కలెక్టర్ ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్లో హౌసింగ్ పీడీ వెంకట నారాయణ, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, సర్వ శిక్ష అభియాన్ పిఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.