PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోండి

1 min read

– జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లాలోని ఉద్యోగుల అర్జీలను సకాలంలో  పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు జిల్లా అధికారులకు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఉద్యోగుల స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు ఉద్యోగుల నుండి వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగుల అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. స్పందన అర్జీల తరహాలోనే ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఏ శాఖకు ఎన్ని గ్రీవెన్స్ లు పంపించడం జరిగిందన్న విషయాలను కూడా నమోదు చేయడం జరుగుతుంది అని డిఆర్ఓ తెలియజేశారు.ఉద్యోగుల స్పందన కార్యక్రమంలో కొన్ని వినతులుకర్నూలు నగరం సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో ఓపి నెంబర్ 39 నందు HIV/ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కౌన్సిలింగ్ మరియు సలహాలు ఇచ్చు కౌన్సిలర్ గా పనిచేస్తున్న ఏ.గౌస్ బాష, వ్రాసుకున్న విన్నపం. నాకు సి క్యాంపు నందు గాని బి క్యాంపు నందు గాని ప్రభుత్వ క్వార్టర్స్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.గూడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఎస్. తులసి రెడ్డి, వ్రాసుకున్న విన్నపం నేను 2007 వ సంవత్సరం నవంబర్ నెల 18వ తారీఖున రాజీవ్ గృహకల్పలో ఇంటి కొరకు గాను 5000 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకున్నాను. కానీ ఇంతవరకు ఇండ్లు కేటాయించలేదు, నాకు ఇండ్లు కానీ లేదా స్థలం కానీ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.పత్తికొండ మండలం నిట్రావతి గ్రామంలో గ్రామ సచివాలయం 2 నందు ఏఎన్ఎం గా పనిచేస్తున్న ఎస్.రాజ్యలక్ష్మి వ్రాసుకున్న విన్నపం నాకు ఆరోగ్యం సరిగా లేదు కావున నన్ను పత్తికొండ గ్రామంలోని సచివాలయం 2 కు డిప్యూటేషన్ వేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.కార్యక్రమంలో సిపిఓ అప్పలకొండ, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, జిల్లాఅధికారులు పాల్గొన్నారు.

About Author