గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోండి
1 min read– హౌసింగ్ డి ఈ సుబ్బారెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని 11 జగనన్న లేఔట్లలో ఒక్కచోట కూడ గృహ నిర్మాణం చేపట్టకపోవడంతో కలెక్టర్ దృష్టికి వెళ్లడం మండల స్థాయి అధికారులకు దీనిపై నివేదిక చెప్పాలని ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం నాడు పెసర వాయి . బూజనుర్. కోర్రపోలురు గ్రామాలలో హౌసింగ్ శాఖ డి ఈ సుబ్బారెడ్డి ఎంపీడీవో మల్లేశ్వరప్ప. తాసిల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో లబ్ధిదారులతో గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా జగనన్న లేఔట్లలో గృహ నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకొని త్వరగా ఇళ్ళ నిర్మాణాలు చేసుకునేలా పంచాయతీ తీర్మానం చేసి గృహ నిర్మాణశాఖ అందజేయాలని అధికారులకు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు గ్రామ సభలు నిర్వహించి వచ్చిన లబ్ధిదారుల సమస్యలు ఫిర్యాదులు స్పందనలపై కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని డి ఈ సుబ్బారెడ్డి తెలిపారు.