హౌసింగ్ సెక్షన్ సేల్ అగ్రిమెంట్లను.. తీసుకోండిలా..!
1 min readపల్లెవెలుగు కర్నూలు : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో PMAY(U) HFA, APTIDCO గృహసముదాయాలలో 300 చ.అ, 365 చ. అ. 430చ. అడుగులు కేటగిరీలలో ఇండ్లను కేటాయించడమైనది. సదరు లబ్దిదారులలో మరణించిన, క్షేత్రస్తాయి పరిశీలనలో ఆనర్హత వలన, చిరునామా మరియు ఫోన్ నెంబర్ సరిగా లేక, అసమ్మతి తెలియచేసినందు వలన , ఇతర గ్రామం/మండలం/జిల్లాల యందు నివసించట వలన సీల్ అగ్రిమెంట్లు తీసుకోలేదు. కావున మరణించిన లబ్దిదారులకు సంబందించిన కుటుంబ సభ్యులు లబ్ధిదారుని మరణ ధ్రువపత్రము, నోటరీ మరియు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొని తమ ప్రాంత సచివాలయ సిబ్బందిని సంప్రదించవలెను. పైన కనబరిచిన కారణముల లబ్ధిదారులు ఈ నోటీసు ప్రకటించిన 3 రోజులలోగా సంబంధిత సచివాలయము నందు లేదా నగరపాలకసంస్థ నందలి హౌసింగ్ సెక్షన్ నందు వివరములు తెలియచేసి సేల్ అగ్రిమెంట్లను తీసుకొనలవలసిందిగా తెలియజేయడమైనది అట్లు లేనిచో 3 దినముల తర్వాత పైన కనబరిచిన కారణముల చేత సేల్ అగ్రిమెంట్లను రద్దుచేసి, తర్వాతి అర్హులకు కేటాయించబడునని తెలియజేయడమైనది అని కర్నూల్ నగరపాలక కమిషనర్ బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.