ప్రతిభకు.. పురస్కారం..
1 min read– NEET( మెడిసిన్) , JEE (II T) లలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం..
– ఒక్కొక్కరికి రూ.50వేలు నగదు అందజేత
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : నీట్( మెడిసిన్), జేఈఈ(ఐఐటీ)లో పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలు అత్యత్తమ ప్రతిభ కనబరచడం ప్రశంసనీయమని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప ఉద్ఘాటించారు. మంచి ర్యాంకులు సాధించిన పిల్లను ఈ సందర్భంగా అభినందించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు ప్రతిభా పురస్కారాలు–2020 కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ ఎంబిబిఎస్ లో 15 మంది , ఐఐటి లో 5 మంది మంచి ర్యాంకులు సాధించిన పోలీసు పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున నగదును పోలీసు సంక్షేమ నిధి నుండే అందజేశారు. ఇంజనీరింగ్ , మెడిసిన్ చదువులకు ఉపయోగపడే పుస్తకాలు, పరికరాలు, ఫీజుల కొరకే ఈ నగదును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ సెబ్ గౌతమిసాలి ఐపియస్ మాట్లాడుతూ…. 20 మంది విద్యార్దులలో 11 మంది మహిళలే ఉన్నారన్నారు. పిల్లలో ఉత్సాహం కల్పించేందుకే ఈ కార్యక్రమమన్నారు. బాగా చదివించాలన్నారు. రాబోయే పోలీసు విద్యార్దులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
* (NEET) మెడిసిన్ మంచి సీట్ సాదించిన విద్యార్థుల పేర్లు… అఖిల్, లహరి, పూజిత ,రమ్య, జాహ్నవి, ఫరీదా, లక్ష్మీ నీరజ, రూపాoజలి, అయేషా, నీలో ఫెర్న్ జ్ , రజిత , గఫార్ అహ్మద్, మాసుమ్ వలి, శిరీష, వెంకటేష్ నాయక్
* (JEE) adv..ఇంజనీరింగ్ లో మంచి సీట్ సాధించిన విద్యార్థుల పేర్లు… లలిత శివ సాయి, నిఖిల్ సాయి , మహి బాబు, అభినవ రాజ్ , వినయ్ .
కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఐపియస్ గారు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ ఎం. కె రాధాక్రిష్ణ, డిఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకటాద్రి , కె వి మహేష్, రాజీవ్ కుమార్, మహబూబ్ బాషా, యుగంధర్ బాబు, రామాంజి నాయక్ , రవీంద్రారెడ్డి , ఇలియాజ్ బాషా , డిపిఓ ఏ ఓ సురేష్ బాబు, ఎస్పీ గారి పి ఏ నాగరాజు ,ఆర్ ఐలు సురేంద్రా రెడ్డి, రమణ, సుధాకర్ , పోలీసు సంఘం అధ్యక్షులు నాగరాజు ఉన్నారు.