నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్లో ప్రతిభ…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఎస్ వి ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, నంద్యాల లో. నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ దిల్లానా-2025 శుక్రవారం మరియు శనివారం నిర్వహించారు. ఈ నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ పోటీలకు జి. పుల్లయ్య కాలేజీ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ విద్యార్థులు హాజరయ్యి తమ ప్రతిభను చాటి బిజినెస్ క్విజ్ లో ప్రధమ బహుమతి సాధించారు. సోమవారం పుల్లయ్య కాలేజీ మేనేజ్మెంట్ వారు గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ అభినందన సభలో ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు, మరియు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ సి. నాగ గణేష్ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇలాంటి పోటీలలో ఎంబీఏ విద్యార్థులు పాల్గొనడం ద్వారా వారిలో ఉన్న సామర్థ్యం, వ్యాపార పరిజ్ఞానం మరియు పోటీ తత్వం పెంపొందించుకోవడానికి ఎంతో అవకాశం ఉందని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా వారి నైపుణ్యాలను మేలు పరుచుకోవడానికి దోహదపడుతుందని విద్యార్థులందరూ ఇలాంటి పోటీల్లో పాల్గొనాలని ఒక వ్యాపారవేత్తగా ఎదగాలని ఈ సందర్భంగా తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అలాగే మొదటి బహుమతి సాధించిన అంబిక,శర్వాణి మరియు ఉషారాణిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.