నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్లో జి.పుల్లయ్య విద్యార్థుల ప్రతిభ
1 min read
పల్లెవెలుగు ,కర్నూలు: సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఎమ్మిగనూరులో నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ గురువారం నిర్వహించారు. ఈ నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ పోటీలకు జి. పుల్లయ్య కాలేజీ ఎంబీఏ విద్యార్థులు హాజరయ్యి తమ ప్రతిభను చాటి పోటీలలో ఉన్న అన్ని విభాగాలలో బహుమతులు కైవసం చేసుకున్నారు. ఇందుకుగాను శుక్రవారం కాలేజ్ మేనేజ్మెంట్ వారు గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ అభినందన సభలో ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ జి. శశి కుమార్ మరియు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ సి. నాగ గణేష్ పాల్గొన్నారు. నిర్వహించిన పోటీలలో ఫైనాన్స్ విభాగంలో మొదటి రెండు బహుమతులు, బిజినెస్ క్విజ్ విభాగంలో మొదటి రెండు బహుమతులు, హెచ్ఆర్ విభాగంలో రెండో బహుమతి మరియు మార్కెటింగ్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో ఎంబీఏ చదువుతున్న మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.శ్రీనివాసరావు బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తూ కాలేజీ మరియు కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఇటువంటి పోటీలలో పాల్గొనేందుకు ఎంతో ప్రోత్సహిస్తుందని తద్వారా విద్యార్థులలో పోటీ తత్వం మరియు లౌకికం, బిజినెస్ పైన అవగాహన, తర్వాత వాటి యొక్క మార్పులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సంపాదించుకోవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ డిపార్ట్మెంట్ విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
