విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పరీక్ష: ఎస్ఎఫ్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక కస్తూరిబా పాఠశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినిలకు టాలెంట్ టెస్ట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష మోడల్ పేపర్ ను ఎస్ఎఫ్ఐ నాయకులతోపాటు కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ఇంచార్జ్ వరలక్ష్మి మరియు పాఠశాల సిబ్బంది కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్న, మండల అధ్యక్షులు ఖాజా లు మాట్లాడుతూ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం వలన పరీక్షల పట్ల వారికి ఉన్న భయాన్ని మరియు ఉద్రిక్తతను పోగొట్టొచ్చని అన్నారు. ఇటువంటి పరీక్షల ద్వారా భవిష్యత్తులో పోటీ పరీక్షలు రాయడం విద్యార్థులకు సులువు అవుతుందని అన్నారు. ఎస్ఎఫ్ఐ గా కేవలం విద్యార్థుల సమస్యల పట్లనే కాదు వారిలో ఉన్న నైపుణ్యాన్ని కూడా వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది స్రవంతి, ఉమా, రాధారాణి, హసీనా ఎస్ఎఫ్ఐ నాయకులు నంది, సలీం, మురళి, మోహన్, మంజునాథ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.