ప్రతిభ కనబరిచిన కస్తూర్బా బాలికలు
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్థానిక మండల కేంద్రం కస్తూర్బా బాలికల విద్యాలయంలో చదువుతున్న బాలికలు రగ్బీ మరియు పవర్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి ఆటల పోటీలలో ప్రతిభను కనబరిచారు.జనవరి 30 నుంచి ఈనెల 1వ తేదీ వరకు కర్నూలు ఆదర్శ విద్యా మందిర్ పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీ ఆటల పోటీల్లో మిడుతూరు కస్తూర్బా బాలికలు కే.భువనేశ్వరి,శ్రావణి,సురేఖ పాల్గొనగా వీరు మొదటి స్థానంలో నిలిచారని పాఠశాల ఎస్ఓ ఉమా గైర్వాణి, పిఈటి సుమలత తెలిపారు.అదేవిధంగా ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు విజయవాడ జగ్గయ్యపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో మిత్ర మూడవ స్థానంలో నిలిచిందని వారు తెలిపారు.