5th స్టేట్ లెవల్ UCMAS లో రైమ్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ
1 min readపల్లెవెలుగు వెబ్, కల్లూరు: కర్నూలు ఎన్ ఆర్ పేట, ఏ క్యాంప్ లో గల రైమ్స్ అకాడమీ విద్యార్థులు 5th స్టేట్ లెవల్స్ ucmas లో సత్తాచాటారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఆన్లైన్ పోటీలో అకాడమీ నుండి 111 మంది విద్యార్థులు పాల్గొనగా 62 మంది ట్రోఫీలు పొందినట్లు ప్రాంఛైజీ డైరెక్టర్ ఎం రూపా తెలిపారు. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమన్నీ నిర్వహించారు. శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రదీప్ అకాడమీ డైరెక్టర్ ప్రదీప్, ఆయన సతీమణి మాలిని హాజరై విద్యార్థులకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రైమ్స్ అకాడమీ డైరెక్టర్ రూప మాట్లాడుతూ ఈ ఆన్లైన్ పోటీలో విద్యార్థులు 10 నిమిషాలలో 200 సమ్( కుడికాలు, తీసివేతలు, గుణకారాలు, భాగహరాలు) చేయవలసి ఉంటుందన్నారు. 2021లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ucmas పోటీలో 38 దేశాలనుండి 18,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో తమ అకాడమీ నుండి ఇద్దరు విద్యార్థులు కె శాశ్వథ్, ఆర్ నాగతన్య ట్రోపిలు గెలుపొందారన్నారు.