ఆఫ్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష పెట్టిన తాలిబన్లు !
1 min read
FILE PHOTO: File picture of members of a Taliban delegation leaving after peace talks with Afghan senior politicians in Moscow, Russia May 30, 2019. REUTERS/Evgenia Novozhenina/File Photo - RC2HHE9TOUUL
పల్లెవెలుగు వెబ్ : ఆఫ్ఘన్ ను పూర్తీ స్థాయిలో ఆక్రమించుకున్న తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ప్రజలందరూ పూర్తీ విశ్వాసం, భరోసా తో జీవించాలని పిలుపునిచ్చారు. సాధారణ రోజూవారీ కార్యకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి హింస లేకుండా తాలిబన్లు శాంతి మంత్రం జపిస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.