PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిజాబ్ వివాదం పై తాలిబన్ల స్పందన !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం పై అప్ఘనిస్థాన్ లోని తాలిబన్లు స్పందించారు. కర్ణాటకలో హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు తాలిబన్లు మద్ధతు ప్రకటించారు. కర్ణాటక ముస్లిం అమ్మాయిలు ఇస్లామిక్ విలువల కోసం నిలబడ్డారని తాలిబన్లు వారిని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం బాలికలు తమ మతపరమైన ఇస్లామిక్ విలువను కాపాడుకునే మార్గాల్లో త్యాగాలు చేశారని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని ట్వీట్ చేశారు. కర్నాటకలో అల్లాహు అక్బర్ నినాదాలు చేసిన నల్ల బురఖా ధరించిన అమ్మాయి చిత్రాన్ని సమంగాని షేర్ చేశారు.

    

About Author