ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నరుకుతా !
1 min readపల్లెవెలుగువెబ్ : బీజేపీ నేత తీన్మార్ మల్లన్న పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నరుకుతానంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ వార్నింగ్ ఇచ్చారు. కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబుతామని, మూడు ముక్కలుగా నరికి పడేస్తామని హెచ్చరించారు. ఇటీవల కేటీఆర్ కుమారుడి పై సోషల్ మీడియాలో హేళనగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పై టీఆర్ఎస్ నేతలు వరుసగా విరుచుకుపడుతున్నారు.