మాట్లాడను.. మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇప్పుడు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మహిళా దినోత్సవ సంబరాలు జరిపారు. సినీ పరిశ్రమలోని మహిళలకు చిరంజీవి దంపతుల సన్మానం చేశారు. అలాగే, మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో చిరు మాట్లాడుతూ..”సినిమా టికెట్ల జీవోపై ఇప్పుడు మాట్లాడను.. ఇది సందర్భం కాదు. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. జీవో గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతా” అని అన్నారు. ఇక కొత్త జీవో ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని..సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రత్యేకంగా మీడియా సమావేశం పెడతాను “అని అన్నారు.