ప్రజా ప్రతినిధులతో మాట్లాడి..సమస్యలను పరిష్కరించాలి
1 min read– అన్ని శాఖల పనితీరును సమీక్షించి సూచనల్లో సలహాలు..
– సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన పెదవేగి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్ని శాఖల పని తీరును సమీక్షించి, పలు సూచనలు చేశారు. అదే విధంగా ప్రజా ప్రతినిధులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతా రమ్య , సొసైటీ చైర్పర్సన్ పెనుమాక వెంకట సుబ్బారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మేక లక్ష్మణరావు, ఎంపీడీవో జి రాజ్ మనోజ్ , ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.