PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘చింతపండు’ షార్ట్ ఫిలిం.. విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: రాయలసీమ సినీ ఆణిముత్యం… జూనియర్​ రాకేష్​ ( పుల్లయ్య) నటించిన చింతపండు షార్ట్​ ఫిలిం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి తనయుడు కాటసాని శివనరసింహారెడ్డి చేతుల మీదుగా యూట్యూబ్​లో విడుదల చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే స్వగృహంలో వందలాది మంది యువకులు,అభిమానుల మధ్య ‘ చింతపండు’ షార్ట్​ఫిలింను రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి మాట్లాడుతూ కర్నూలుకు చెందిన జూనియర్​ రాకేష్​ ( పుల్లయ్య) సినీ పరిశ్రమలో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే పలు షార్ట్​ఫిలింలు తీసి.. విజయం సాధించిన రాకేష్​.. రాయలసీమ చరిత్ర ఖ్యాతికెక్కేలా సినిమాలు, షార్ట్​ఫిలింలు తీయాలని సూచించారు.


About Author