విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు – AISF
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విద్యార్థులకు అనుగుణంగా ఆదోని ఎమ్మిగనూరు నుండి వచ్చే బస్సులను బైపాస్ మీద నుండి కాకుండా పట్టణంలో నుంచి నడపాలని బస్ డిపో ఇంచార్జ్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రమాదాలకు గురి అవుతున్న కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. పత్తికొండ పట్టణంలో గత 8 నెలల నుండి ఆదోని ఎమ్మిగనూరు నుండి వచ్చే విద్యార్థి బస్సులు పత్తికొండ పట్టణం నుండి కాకుండా బైపాస్ లో బస్టాండుకు వెళ్తున్నాయి.ఈ కారణంగా ఆయా గ్రామాల నుండి వచ్చే విద్యార్థులను బైపాస్ లో వదిలేసి వెళ్తున్నాయి. ప్రైమరీ స్కూల్ విద్యార్థులు అక్కడి నుండి తమ స్కూలుకు వెళ్ళు మార్గం మధ్యలో ప్రమాదాలకు గురి అవుతున్నారు. దీనివలన విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి గతంలో లాగానే యధావిధిగా పట్టణంలో నుంచి బస్సులు నడపాలని వారు ఆర్టీసీ అధికారులను కోరారు. ఇప్పటివరకు కొంతమంది విద్యార్థులు చిన్న చిన్న ప్రమాదాలకు గురి అయ్యారని, దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను పాఠశాలలు పంపడానికి భయపడుతున్నారని, కాబట్టి అధికారులు విద్యార్థులు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అనుగుణంగా బస్సులు నడపాలని కోరారు. లేదంటే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వినోద్, రమేష్ ఏఎస్ఎఫ్ నాయకులు ఇమ్రాన్, భాష ,తదితరులు పాల్గొన్నారు.