PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టార్గెట్​.. మిస్సవ్వకూడదు..!

1 min read

– ఆదిశగా చర్యలు తీసుకోండి
– ఉపాధి అధికారులను ఆదేశించిన జేసీ ( ఆసరా మరియు సంక్షేమం) ఎంకేవీ శ్రీణివాసులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు :అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని, పని కల్పించలేదని మాట ఎక్కడ రాకుండా చూడాలని ఉపాధి హామీ పథకం సిబ్బందికి జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం ) ఎం కె వి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు వెల్ఫేర్) చాంబర్ లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద లేబర్ టర్నోవర్ మరియు ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ఏపీడి లు, అడిషనల్ పిడిలతో, పిడి డ్వామా గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా లేబర్ యొక్క పని దినాలకు సంబంధించి జూన్ నెలలో 46 లక్షలు చేయాలని క్లస్టర్ వారిగా, మండలం వారిగా, గ్రామపంచాయతీ వారిగా టార్గెట్ ఏర్పాటుచేసి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఉపాధి సిబ్బందికి ఆదేశించారు. హార్టికల్చర్ మరియు అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి ఎనిమిది వేల ఎకరాలలో లక్ష్యాన్ని సాధించాలని… రెండు వేల కిలోమీటర్ల పొడవున రోడ్డుకిరువైపులా చెట్లను నాటడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 15వ తేదీ లోపల గుంతలు తీయడం పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్వామా పి.డి అమర్నాథరెడ్డి, ఏ పి డి, తదితరులు పాల్గొన్నారు.

About Author