ఎలక్ట్రిక్ వాహనం పై నమ్మకాన్ని పెంపొందించడం అనే లక్ష్యంతో దూసుకెళుతున్న TATA.ev
1 min read
పల్లెవెలుగు , కర్నూలు: ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామి మరియు భారతదేశ EV రంగంలో విప్లవానికి తెరతీసిన TATA.ev, ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించిన అపోహలను తొలగించడంలో అందరికంటే ముందంజలో ఉంది, వాటి స్వీకరణను వేగవంతం చేయడానికి మరియు విస్తృతంగా తెలియజేడానికి ఒక భవిష్యత్తు ఎంపికగా మార్చడానికి కృషి చేస్తోంది.EVల గురించిన ముఖ్యమైన అపోహలలో, వాటి పరిమిత శ్రేణి అనేది ఒక అపోహ. TATA.ev ఈ సమస్యను Nexon.ev 45 & Curvv.ev వంటి ఉత్పాదనల ఆవిష్కరణ ద్వారా పరిష్కరిస్తోంది, ఇది ARAI-సర్టిఫైడ్ 489 – 502 km (P1+P2) & C75* శ్రేణిని 350-425 km అందిస్తుంది. ఈ రెండు మోడళ్లు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి, దీనితో, 40 నిమిషాల్లోనే 10-80% వరకు ఛార్జింగ్ స్థాయిని చేరుకుంటాయి. మరొక ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, ఈ Curvv.ev, 70kW+ ఛార్జర్‌ని ఉపయోగించి 15 నిమిషాల్లో 150 కి.మీ శ్రేణిని జోడిస్తుంది. ఈ కంపెనీ కస్టమర్ ఆలోచనలలోని పరివర్తనను, అంటే 47% మంది వినియోగదారులు ప్రతిరోజూ 75 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించారని గమనించింది. 2024లో, 2020లో 13% మంది వినియోగదారులు ఉండగా 2024లో ఇందుకు పూర్తి విరుద్ధంగా గల గణాంకాలతో, EVలు కేవలం నగరంలో ప్రయాణించడానికి మాత్రమే పరిమితం అనే భావనను తోసిపుచ్చింది. అయితే, ICE వాహనాల కంటే EVలు చాలా ఖరీదైనవి అనే అపోహలను పటాపంచలు చేస్తూ, TATA.ev స్థానికీకరణ మరియు సాంకేతిక పురోగతుల సహాయంతో, మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ICE వాహనాలకు సమానమైన ధరకు Curvv.ev మరియు Nexon.ev లను అందించడం ద్వారా ఈ అంతరాన్ని విజయవంతంగా పూరించింది. పోటీతో పోలిస్తే మరిన్ని అంశాలు కలిగి ఉండటం వలన, ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది ఇప్పుడు ఎక్కువ మందికి అందుబాటులో ఉంది. అవి తక్కువ ఖర్చు కలిగి ఉండడంతో పాటు, EVలు స్వయంచాలక సదుపాయంతో రూపొందించబడి, సాంప్రదాయ IC పవర్‌ట్రెయిన్‌లతో పోల్చినప్పుడు, వాటిలో చలన భాగాలు తక్కువగా ఉండటం మూలాన, అవి నిశ్శబ్దమైన, శక్తివంతమైన డ్రైవ్‌లు, ఉత్తేజకరమైన పనితీరు మరియు తక్కువ నిర్వహణ ఖర్చులను కలిగి ఉంటాయి. TATA.ev EV విభాగంలో క్రొంగొత్త భద్రతా ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది. Punch.ev, Nexon.ev మరియు Curvv.ev అన్నీ BNCAP నుండి అద్భుతమైన 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను సాధించాయి. ఈ వాహనాలు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, IP67-రేటెడ్ వాటర్‌ప్రూఫ్ మరియు డస్ట్‌ప్రూఫ్ మోటార్లు మరియు అధునాతన లెవల్-2 ADAS టెక్నాలజీ వంటి అంశాలు కలిగి ఉండడంతో, ఇవి డ్రైవర్ మరియు ప్రయాణీకుల భద్రతకు భరోసా కల్పిస్తాయి.దీని గురించిన అవగాహన పెంచడానికి, ప్రోత్సహించబడిన వర్గాలు మరియు టాటా EVలను కొనుగోలు చేయడానికి, సర్వీసింగ్ చేయడానికి అంకితమైన వన్-స్టాప్ సొల్యూషన్‌ను అందించడానికి, ఈ కంపెనీ భారతదేశం అంతటా ఆరు EV-ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లను మరియు మూడు ప్రత్యేక సేవా కేంద్రాలను ప్రారంభించింది.ప్రస్తుతం, వినియోగదారు ఆలోచనలు, ఈ మార్పును స్వీకరించే కొద్దిపాటి సంఖ్య నుండి అనేక మంది స్వీకరించే దిశలో పరిణామం చెందుతున్నందున, దీని అందుబాటును పెంచడం, అవరోధాలను అధిగమించడం మరియు అపోహలను తొలగించడం ద్వారా TATA.ev EVలను ప్రధాన ప్రజా స్రవంతిలోకి తీసుకురావడానికి నిబద్ధతతో అడుగులు వేస్తోంది.ముగింపు- C75: 75% కస్టమర్లకు అంచనా వేసిన నిజ జీవిత డ్రైవింగ్ పరిధిP1+P2: ARAI సర్టిఫైడ్ MIDC సైకిల్ రన్నింగ్ ఖర్చు/కిమీ: EV కి ₹ 1 & ICE కి ₹ 8 (నెలవారీ 1,000 కిమీ డ్రైవ్).