PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో రవాణా వాహనాల పన్ను బకాయిలను  వెంటనే చెల్లించాలి.. 

1 min read

– ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి

పల్లవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లాలో రవాణా వాహనాల పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని  ఉప రవాణా కమీషనర్ ఎస్. శాంతకుమారి  ఒక ప్రకటనలో తెలిపారు.  ఏలూరు  జిల్లాలో 2023 జూన్, 30వ తేదీ నాటికి  10 వేల  432 వివిధ రకాల రవాణా వాహనాలు పన్ను చెల్లించవలసి ఉందన్నారు.  వారు వెంటనే తమ పన్నులను చెల్లించాలన్నారు. వాహనాలను స్క్రాప్ కి ఇచ్చినట్లయితే సంబంధిత పత్రాలను రవాణా శాఖ కార్యాలయంలో సమర్పించి ఆర్. సి., క్యాన్సిలేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకునే వరకు రవాణా శాఖ రికార్డులలో వాహనం మనుగడలో ఉన్నట్లేనని  శాంతకుమారి   తెలియజేసారు.

About Author