NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌న్ను క‌ట్ట‌ని వారి చెత్త‌.. వారి ఇంటి ముందే పోయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చెత్త సేక‌ర‌ణ పై శ్రీకాకుళం ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పన్ను క‌ట్ట‌ని వారి చెత్త వారి ఇంటి ముందే పోయాలంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. 100 రూపాయ‌ల చెత్త ప‌న్ను వ‌సూలు చేస్తే త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం చేయాల్సింది అంతా చేస్తున్నామ‌ని, ప‌న్ను క‌ట్ట‌ని వారి చెత్త వారి ఇంటి ముందే పోయాల‌ని అన్నారు. అనుభ‌విస్తు తెలుస్తుంద‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు డ‌బ్బులు పంచాలి కానీ.. డ‌బ్బు క‌ట్టం అంటే ఎలా అని ప్ర‌శ్నించారు. ధ‌ర్మాన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.

                                  

About Author