సెలవు దినాల్లోనూ.. పన్నులు చెల్లించవచ్చు
1 min read
శని, ఆదివారాల్లో పన్ను వసూలు కేంద్రాలు తెరిచే ఉంటాయి
నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు
కర్నూలు ,న్యూస్ నేడు: శుక్రవారం నగరపాలక సంస్థకు చెల్లించవలసిన పన్నులను సెలవు దినాల్లో సైతం ప్రజలు చెల్లించవచ్చని నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31వ తేదీ వరకు రెండవ శనివారం, ఆదివారం మతో పాటు ప్రతిరోజు సాయంత్రం అదనంగా ఒక గంట (06:00) వరకు పన్ను వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగర ప్రగతికి పన్నులే కీలకమని, ఆస్తి, నీటి పనులను చెల్లించి ప్రజలందరూ సహకరించాలని మేనేజర్ కోరారు.