NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ.. బీజేపీ ..జనసేన కూటమిదే అధికారం

1 min read

ప్రజాగళం సభ విజయవంతం..

టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: టీడీపీ బీజేపీ జనసేన కూటమిదే అధికారమని అందుకు నిదర్శనమే చిలకలూరిపేటలో ఆదివారం జరిగిన ‘ప్రజాగళం’ సభ విజయవంతం అయిందని నంద్యాల పార్లమెంట్  టీడీపీ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య  అన్నారు.సోమవారం అల్లూరు లోని మాండ్ర స్వగృహంలో  మీడియా సమావేశంలో వారు  మట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం తథ్యం అని తెలిపారు. ప్రజాగళం  సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు.  బొప్పూడి జనసంద్రం పోటెత్తిందని టిడిపి-జనసేన- బిజెపి పట్ల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ప్రజాగళం సభ నిదర్శనంగా నిలిచిందన్నారు. జగన్ రెడ్డి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం  నిర్ణయించుకుందని అన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజాగళం సభకు లక్షల్లో జనం వచ్చి తమ మద్దతు తెలిపారు. జగన్  హయాంలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అని అన్నారు. వైఎస్సార్ సీపీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలు వేరు కాదు. ఈ రెండు పార్టీలు ఒకే కుటుంబానికి చెందినవని ఎన్నికల్లో ఓటు బ్యాంకు ను చీల్చడమే వాటి ఉద్దేశ్యమని పేర్కొన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపాలని పిలుపునిచ్చారు.సమావేశంలో టీడీపీ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుండం రమణా రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కొత్తపల్లి మండల కన్వీనర్ నారపు రెడ్డి,జూపాడుబంగ్లా మండల కన్వీనర్ గిరీశ్వర రెడ్డి,  ఐటీడీపీ నందికొట్కూరు ఇంచార్జి మూర్తుజావలి, టీడీపీ మైనార్టీ నాయకులు జమీల్, పగిడ్యాల టీడీపీ నాయకులు పగడం సోమ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

About Author