NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ అభ్యర్థి నామినేష‌న్ ప‌త్రాలు లాక్కెళ్లారు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల నామినేష‌న్ ప్రక్రియ‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నామినేష‌న్ దాఖ‌లుకు ఇవాళే ఆఖ‌రి రోజు. ఈ నేప‌థ్యంలో తెదేపా అభ్యర్థి నామినేష‌న్ వేసేందుకు ప్రయ‌త్నించ‌గా.. గుర్తుతెలియ‌ని వ్యక్తులు నామినేష‌న్ ప‌త్రాల‌ను లాక్కెళ్లారు. కుప్పం మున్సిపాలిటీలోని 14వ వార్డు తెదేపా అభ్యర్థిగా వెంక‌టేశ్ నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు వెళ్లారు. నామినేష‌న్ వేసే స‌మ‌యంలో గుర్తుతెలియ‌ని కొంద‌రు వ్యక్తులు నామినేష‌న్ ప‌త్రాలు లాక్కెళ్లార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ క్రమంలో వెంకటేష్ చేతికి గాయ‌మైంది. ఇటీవ‌ల రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ప్రకారం కుప్పం మున్సిపాలిటీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

About Author