PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పైపై రంగులు త‌ప్ప నిజ‌మైన అభివృద్ధి లేదు.. టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

8వ వార్డులో టి.జి భ‌రత్ భ‌రోసా యాత్ర‌

టి.జి భ‌ర‌త్‌కు బ్రహ్మర‌థం ప‌ట్టిన ప్ర‌జ‌లు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో పైపైన రంగులు త‌ప్ప నిజ‌మైన అభివృద్ధి లేద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని 8వ వార్డు పెద్ద ప‌డ‌ఖానాలో ఆయ‌న టి.జి భ‌ర‌త్ భ‌రోసా యాత్ర కార్యక్రమం చేప‌ట్టారు. వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి పెద్దలు, మ‌హిళ‌లు, యువ‌కుల‌ను క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల‌ని అభ్యర్థించారు. ఈ నాయ‌కుల పాల‌న‌లో మాట‌లు కోట‌లు దాట‌డం త‌ప్ప జ‌రిగిందేమీ లేద‌న్నారు. ఒక‌వైపు వార్డుల్లోని ప్రజ‌లు స‌మ‌స్యల‌తో ఇబ్బందులు ప‌డుతుంటే.. మ‌రోవైపు న‌గరాన్ని స్మార్ట్ సిటీ చేశామ‌ని నాయ‌కులు గొప్పలు చెప్పుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశామ‌ని చెబుతున్నప్పటికీ వీధుల్లో స‌మ‌స్యలు మాత్రం తీర‌లేద‌న్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే నాయ‌కుడు ఉంటేనే ప్రజ‌లంద‌రికీ సంక్షేమం, అభివృద్ధి ఫ‌లాలు అందుతాయ‌ని పేర్కొన్నారు. గ‌డిచిన ప‌దేళ్లలో క‌ర్నూలు ఎంతో వెనుక‌బ‌డిపోయింద‌న్నారు. తమ టి.జి కుటుంబం అధికారంలో లేక‌పోయినా ప్రజాసేవ‌లోనే ఉంద‌న్నారు. త‌మ‌కు అధికారం ఇస్తే క‌ర్నూలును ఎంతో అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. తాను ఇంత‌వ‌ర‌కు ఎమ్మెల్యే అవ్వలేద‌ని.. ఒక్కసారి త‌న‌కు అవ‌కాశం ఇస్తే త‌న ప‌నితీరు ఎలా ఉంటుందో ప్రజ‌లంద‌రికీ తెలుస్తుంద‌న్నారు. 6 గ్యారెంటీల‌తో క‌ర్నూలు కోసం తాను తీసుకొచ్చిన మేనిఫెస్టో వ‌ల్ల ప్రజ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఈ ఆరు గ్యారెంటీలు ఐదేళ్లలో అమ‌లు చేయ‌కపోతే ఆ త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీయే చేయ‌న‌ని టి.జి భ‌ర‌త్ స్పష్టం చేశారు. ప్రజ‌లంద‌రూ త‌న‌ను ఆశీర్వదించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేట‌ర్ ప‌ర‌మేష్‌, అశోక్, క‌స్తూరి వెంక‌టేశ్వర్లు, నాగార్జున, శేషఫణి,, శేషన్న, హరి, హ‌రి క్రిష్ణాజీ రావు, శ్రీకాంత్, జుబేర్ అహ్మద్, అభిలాష్‌, శ్రీధర్, శ్రీకాంత్, ఎజాజ్ బాషా, సలాం, మ‌ల్లికార్జున‌, శేషన్న మంజు, లక్ష్మీనారాయణ, మధు,ఓం నాథ్,  రవీంద్రుడు, గ‌ఫార్, సువ‌ర్ణ‌, నాగార్జున‌, క్రిష్ణ‌, ఎల్ల‌య్య‌, రేణుక‌, శ్రీధ‌ర్, ల‌క్ష్మీ నారాయ‌ణ‌, ఇర్ఫాన్, మంగ‌మ్మ‌, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు పాల్గొన్నారు.

About Author