ఉపపోరు నుంచి తప్పుకున్న టీడీపీ
1 min readపల్లెవెలుగువెబ్: తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) గురువారం కీలక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ తెలంగాణ శాఖ (టీ టీడీపీ) నిర్ణయించింది. ఈ మేరకు టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు గురువారం అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.