NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోం మంత్రి ఇలాకాలో ఎగిరిన టీడీపీ జెండా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ హోం మంత్రి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. ది కొవ్వూరు కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు లిమిటెడ్‌ ఎన్నికల్లో విజయం సాధించి ఊహించని రీతిలో షాక్‌ ఇచ్చా రు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా అర్బన్‌బ్యాంకు కార్యకలాపాలు టీడీపీ చేతుల్లోనే కొనసాగుతున్నా యి. ఈ సారి ఎలాగైనా అర్బన్‌ బ్యాంకును చేజిక్కుంచుకోవాలన్నది వైసీపీ నాయకుల ఆలోచన. ఆ ఆలోచనకు టీడీపీ నాయకులు గండికొట్టారు. 2022 ఆగస్టు 4వ తేదీతో ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగుస్తోంది. దీంతో అధికార పార్టీ సొసైటీల మాదిరిగా త్రిసభ్య కమిటీవేసి అర్బన్‌ బ్యాంకును కైవసం చేసుకోవాలని చర్యలు చేపట్టింది. ముందుగా పసిగట్టిన టీడీపీ నాయకులు 1964 కో-ఆపరేటివ్‌ సొసైటీ యాక్టు 43 ప్రకారం మంగళవారం ఎన్నికలు నిర్వహించుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఐదో సారి బ్యాంకు చైర్మన్‌గా మద్దిపట్ల శివరామకృష్ణ ఎన్నికయ్యారు.

                                          

About Author