వైసీపీ నేత భౌతికకాయానికి టీడీపీ జెండాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ నేత భౌతికకాయానికి టీడీపీ జెండాలు కప్పడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖ జిల్లా భీమిలికి చెందిన అప్పికొండ అప్పలనాయుడు టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్నారు. మూడేళ్ల క్రితం వైసీపీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయనను ఆదివారం నియోజకవర్గ టీడీ పీ ఇన్చార్జి కోరాడ రాజబాబు, గంటా నూకరాజు, పా ర్లమెంటరీ నియోజకవర్గ నేత డి.ఎ.ఎన్.రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ‘వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశాను. ఒకవేళ చనిపోతే నా మృతదేహంపై టీడీపీ జెండా కప్పి అంతిమయాత్ర జరిపించండి’ అంటూ అప్పలనాయుడు వాపోయారు. దురదృష్టవశాత్తూ ఆ మరునాడే(సోమవారం) అప్పలనాయుడు చనిపోయా రు. దీంతో కోరాడ రాజబాబు బృందం మృతదేహాన్ని సందర్శించి ఆయన కోరుకున్నట్టే మృతదేహంపై టీడీపీ జెండాలు కప్పి అంతిమ యాత్ర జరిపించారు.