ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
1 min read
కౌతాళం , న్యూస్ నేడు : మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో శనివారం టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి, టిడిపి సీనియర్ నేత చూడి ఉలిగయ్య హాజరయ్యారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలోనే పార్టీని అధికారంలోకి తెచ్చి రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసిన ఘనత టిడిపిదే అని వారు కొనియాడారు… ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు, టిప్పుసుల్తాన్, వెంకటపతి రాజు, అడివప్పగౌడ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.