NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రానున్నది టిడిపి ప్రభుత్వమే..

1 min read

– వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది..
– 17 వ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ఠానికి కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని 17వ వార్డులో శుక్రవారం టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఇదేమిఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమం మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడున్నరేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులే ధర్నాలు చేస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రగల్భాలు పలకడం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించింది ఎక్కడా లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పడుతున్నారని, అది చూసి వైసిపిలో వణుకుపుడుతుందన్నారు.రానున్నది టిడిపి ప్రభుత్వమేవ్యవస్థలన్నీ మళ్లీ బాగుపడాలంటే చంద్రబాబును నాయడు తోనే సాధ్యమవుతుందని అన్నారు అందుకనే రాష్ట్ర భవిష్యత్ బాగు పడాలంటే చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలోకార్యక్రమంలో క్లస్టర్ కో ఆర్డినేటర్ లాయర్ జాకీర్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు మద్దిలేటి, ఐ టిడిపి అధ్యక్షులు మూర్తుజావలి, ఎస్సి సెల్ అధ్యక్షులు జయాకర్, పట్టణ తెలుగుయువత నాయకులు కుమార్,సతీష్,నాయకులు వెంకటేష్, కళాకార్, అప్సర్ బాషా, ఖళీళ్ బేగ్, పౌలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.

About Author