ముస్లీంలు బాగుపడాలంటే టిడిపి ప్రభుత్వం రావాలి… టి.జి భరత్
1 min readకర్నూలు నగర మైనారిటీ కమిటీని ప్రకటించిన టి.జి భరత్
ముస్లీంలలో చైతన్యం తీసుకురావాలని సూచన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ముస్లీంలకు ఎంతో మేలు జరుగుతుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. మౌర్య ఇన్లోని పరిణయ హాల్ లో సమావేశం ఏర్పాటుచేసి మైనారిటీ నగర కమిటీని ఆయన ప్రకటించారు. నగర అధ్యక్షుడిగా అబ్దుల్ హమీద్, ఉపాధ్యక్షులుగా జుబేర్ ఆలీఖాన్, అబ్దుల్ రజాక్, షేక్ ఇమ్రాన్ సలీం, మహమ్మద్ ముస్తఫా ఖాన్, ప్రధాన కార్యదర్శిగా మెహబూబ్ బాషాలతో కలిపి మొత్తం 20 మందితో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వీరికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వీధుల్లోకెళ్లి మహిళలు, యువతలో చైతన్యం తీసుకురావాలన్నారు. అందరం కష్టపడితేనే ఫలితం ఉంటుందన్నారు. టిడిపి వస్తే ఉద్యోగాలు వస్తాయని, అందరికీ పని దొరుకుతుందన్నారు. కర్నూల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే గతంలో ఎన్నడూ లేని డెవలప్మెంట్ చేస్తానని తెలిపారు. హిందూ, ముస్లీం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మంచి చేసే నాయకుడు ఎవరో ప్రజలకు వివరించాలని కమిటీ సభ్యులకు భరత్ సూచించారు. అనంతరం నూతక కమిటీ సభ్యులు టి.జి భరత్ ను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి జహంగీర్ బాషా, సీనియర్ నేతలు మన్సూర్ ఆలీఖాన్, అబ్బాస్, మెహబూబ్ ఖాన్, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.