NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనసేన.. టిడిపి పొత్తులతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం

1 min read

భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో పాలకుర్తి తిక్కారెడ్డి

రాష్ట్రంలో చంద్రబాబు, మంత్రాలయంలో తిక్క రెడ్డి గెలుపు ఖాయం.

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం మండల కేంద్రమైన భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం గురువారం మంత్రాలయం ఇన్చార్ తిక్క రెడ్డి నిర్వహించారు.జగద్గురు ఖాదర్ లింగ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక ఫతేహాలు చేసి మొక్కు తీర్చుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల కురుక్షేత్రంలో జనసేన టిడిపి పొత్తులతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని భవిష్యత్ గ్యారెంటీ ఇది బాబు షూరిటీ చేసిన ప్రతి హామీలను నెరవేర్చి విధంగా బాబు గ్యారెంటీ ప్రతి ఇంటికి షూరిటీ కరపత్రం ఇవ్వడం జరుగుతుందని అందులో ఆరు హామీలు మహిళకు ఉచిత బస్సు,సంవత్సరానికి మూడు సిలిండర్లు,రైతులకు సంవత్సరానికి పెట్టుబడుకు నగదు,నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయలు,వంటి కార్యక్రమంలో బాబు షూరిటీ  లో ప్రజలకు చేరవేయడం జరుగుతుందని అన్నారు.మంత్రాలయం నియోజకవర్గం లో మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇక్కడ అభివృద్ధి చేయలేదు అని వాళ్ల నాయకులు,కార్యకర్తలు అక్రమ ఇసుక,అక్రమ కర్ణాటక మద్యం అమ్మి సొమ్ము చేసుకున్నారని వారు ఆరోపించారు.ప్రజలందరూ ఆశీస్సులతో ఈ ఒక్క సారి నాకు అవకాశం కల్పించండి అంటూ గ్రామాల్లో ఆయన కార్యకర్తలకు గ్రామ ప్రజలకు తెలియజేశాడు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, వెంకటపతిరాజు,అడివప్ప గౌడ్,కురుగోడు, టిప్పుసుల్తాన్, కాశివిశ్వనాధ,మంజు, రహిమాన్,రాజబాబు,ఎరిగేరి వీరేష్,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author