PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హజ్ హౌస్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

1 min read

– నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : హజ్ హౌస్ గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని , హజ్ హౌస్ కోసం 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని కమలాపురం నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష అన్నారు, ఆదివారం అయిన చెన్నూరు లో విలేకరులతో మాట్లాడుతూ, గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కోసం హజ్ హౌస్ నిర్మిస్తామని చెప్పినప్పుడు, తామంతా స్వాగతించామని అయితే 14 ఎకరాలు ఖిల్లా మసీదుకు సంబంధించిన భూమిని కూడా ఇవ్వడం జరిగిందన్నారు, అయితే హజ్ హౌస్ కట్టేటప్పుడు కొన్ని నిబంధనలు అనుసరించి కట్టాల్సింది పోయి, తెలుగుదేశం స్వార్థ ప్రయోజనాల కోసం హచ్ హౌస్ నిర్మించడం జరిగిందన్నారు, హజ్ హౌస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా ఉండాలని, అలాగే హజ్ యాత్రికలకు అన్నివసతుల ఏర్పాటుకు అనుగుణంగా ఉండాలని ఆయన తెలియజేశారు, కాగా నేడు హజ్ హౌస్ మైనార్టీలకు ఏ విధంగా ఉపయోగపడని విధంగా తెలుగు దేశం పార్టీ వారు నిర్మించడం చాలా బాధాకరంగా ఉందని ఆయన తెలిపారు ,హజ్ హౌస్ ప్రక్కనే రామనపల్లె వంక ఉండడంతో, హజ్ హౌస్ కు ఇచ్చిన స్థలంలో మట్టి తొలి వంకకు ఎత్తు ప్రాంతంలో నిర్మించాల్సింది పోయి, వారి ఇష్టానుసారంగా హజ్ హౌసును తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి కూడా హచ్ హౌస్ లోనికి నీళ్లు రావడం జరుగుతుందన్నారు, దీంతో హజ్ హౌస్ ఒకానొక సమయంలో కోవిడ్ సమయంలో కరోనా సెంటర్ గా పెట్టడం జరిగిందన్నారు, కోవిడ్ సమయంలో వర్షం వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుగుదేశం నాయకులకు బాగా తెలుసని తెలిపారు, పోలీసుల సహాయంతో, అధికారుల సహాయంతో హజ్ హౌస్ లో ఉన్న కరోనా బాధితులను కాపాడుకోవడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అందరికీ తెలిసిన విషయమేనని ఆయన తెలియజేశారు, అంటే హజ్ హౌస్ మైనార్టీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కల్లారా చూడడం జరిగిందని ఆయన తెలియజేశారు, నేడు ఎన్నికలు దగ్గరగా సమీపిస్తున్నాయని ఏదో మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉందని చెప్పుకోవడానికి నాన యాగి చేస్తుందే తప్ప, మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ చేసింది ఏమీ లేదని తెలిపారు, గత టిడిపి హయాంలో మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇచ్చిన పాపాన పోలేదని, నేడు మైనార్టీల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు, గత సార్వత్రిక ఎన్నికల ముందు కడపకు ఉర్దూ యూనివర్సిటీ ప్రతిపాదించడం జరిగిందని, తర్వాత దానిని కర్నూలుకు తరలించినప్పుడు ఈ తెలుగుదేశం నాయకులకు ఎక్కడికి వెళ్లారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలుగుదేశం నాయకుల పై మండిపడ్డారు, హజ్ హౌస్ దగ్గరికి పోయి ఉపన్యాసాల ద్వారా మైనార్టీలకు వీరేదో చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు, ఇప్పటికైనా మంచి సలహాలు, ఇస్తే తాము కూడా సంతోషిస్తాం కానీ, ముఖ్యమంత్రిని స్థాయి అర్హత తెలుగుదేశం పార్టీ వారికి లేదని ఆయన ఘాటుగా విమర్శించారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరీం, బాసు , వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author