13వ రోజు కొనసాగిన టిడిపి నిరాహార దీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఏపీ స్కూల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని కోరుతూ, పత్తికొండలో చేపట్టిన టిడిపి నిరాహార దీక్షలు 13వ రోజుకు టిడిపి నియోజకవర్గ ఇంచార్జి కే.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివరెడ్డి మాట్లాడుతూ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అక్రమం అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు,రిమాండ్ కు తరలించడాన్ని ఖండిస్తూ బాబుకి తోడుగా… ఒక్క నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు.13 వరోజు నిరాహార దీక్షలో SC సెల్ నియోజకవర్గ కమిటీ సభ్యులు నిరాహార దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్షలు చేపడుతున్న వారికీ సంఘీభావం ప్రకటించారు. నిరాహార దీక్ష కార్యక్రమంలో టిడిపి నాయకులు బట్టలు వెంకట్రాముడు, భక్తుని లోకనాథ్, మనోహర్ చౌదరి, లక్ష్మీనారాయణ చౌదరి, రామానాయుడు, తిరుపాలు, అశోక్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సురేంద్ర, నరసింహులు, సింగం శ్రీనివాసులు, మీరా హుస్సేన్, సంజప్ప తదితరులు పాల్గొన్నారు.