నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన టీడీపీ ఇంచార్జి టిజి భరత్
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి టిజి భరత్ ఘన స్వాగతం పలికారు. ప్యాపిలి మండలం డి.రంగాపురం గ్రామంలో జిల్లా నాయకులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు.