టీడీపీ కీలక నిర్ణయం.. వలంటీర్లకు పోటీగా… ?
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వలంటీర్లకు పోటీగా పార్టీ తరపున సేవామిత్రలను ఏర్పాటు చేయనున్నట్టు చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రకటించారు. ప్రతి వందమంది ఓటర్లకు ఒక యువ ప్రతినిధిని పార్టీ తరఫున ఏర్పాటుచేసి, అధికారంలోకి వచ్చాక వాళ్లనే వలంటీర్లుగా మారుద్దామని చంద్రబాబు సమావేశంలో వెల్లడించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు అనేక రాజకీయపరమైన, పార్టీపరమైన పనులు కూడా వలంటీర్లకు అప్పగించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు.