అధికారం టిడిపిదే ..!
1 min readబాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ పై ఇంటింటా ప్రచారం లో..
దూకుడు పెంచిన గిత్త జయసూర్య
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అధికారం చేపట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో శనివారం ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అల్లూరు లోని ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం బాబు సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు .ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టి పెట్టినందుకు ప్రజలు పశ్చాతాపం పడుతున్నారని తెలిపారు. ప్రచారంలో అనేక సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకు వస్తున్నారని, జగన్ సంక్షేమ పథకాల పేరుతో బటన్ ను నొక్కడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. చంద్రబాబు “విజన్” ఉన్న నాయకుడని, జగన్ “రీజన్” లేని నాయకుడని రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలం చెందారని మండిపడ్డారు. రాక్షస పాలనను, రాచరిక పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి ,సున్నం పల్లె శ్రీనివాసులు, మాండ్ర రత్నాకర్ రెడ్డి, కురువ పెద్దరాజు, కురువ చిన్నరాజు,బోయ యాగంటి,నాగశేషన్న,శ్రీనివాస రెడ్డి,పాలబాబు,సాంబశివుడు,మహేష్,బూపన ప్రవీణ్ కుమార్,దినేష్,వడ్డే రమణ,గిత్త నాగార్జున,మాబాష,రహిమాన్ ,గొల్ల రామచంద్రుడు,మదార్ బాష,శివ,కురుమన్న,గొల్ల రాజు,మణికంఠ,దేవా,గిత్త ప్రవీణ్,తిరుపాలు,వెంకటేశ్వర్లు, తెలుగు వెంకటేశ్వర్లు,మహబూబ్ బాష,తదితరులు పాల్గొన్నారు.