NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీకి వైర‌స్ సోకింది.. వ్యాక్సిన్ వేయాల్సిందే..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అనే వైర‌స్ సోకింద‌ని.. వ్యాక్సిన్ వేయ‌క‌పోతే టీడీపీ చచ్చిపోతుంద‌ని ప్రముఖ ద‌ర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వ‌ర్మ ఏది మాట్లాడినా.. చేసినా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుంది. ఇప్పుడు నారా లోకేష్ టార్గెట్ గా వ‌ర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయ‌డంతో.. వ‌ర్మ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ట్విట్టర్ వేదిక‌గా వ‌ర్మ నారాలోకేష్ మీద కామెంట్స్ చేశాడు. తెలుగు దేశం పార్టీకి నారా లోకేష్ అనే సూక్ష్మజీవి ప‌ట్టుకుంది.. అది ప్రాణాంత‌క‌మైన జీవి.. వెంట‌నే ఆ వైర‌స్ కి వ్యాక్సిన్ వేయాల‌ని అన్నారు. ఆ వ్యాక్సిన్ పేరు ‘తార‌క్ 9999’ అని చెప్పాడు. టీడీపీ కార్యక‌ర్తలంద‌రూ త‌న సల‌హా విని వ్యాక్సిన్ వేయ‌క‌పోతే.. చ‌చ్చిపోతారంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

About Author