వాలంటీర్ వ్యవస్థకు టిడిపి వ్యతిరేకం కాదు.. టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ తమ పార్టీ రాజకీయాలు చేసే వాలంటీర్లకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. రాబోయే మా ఎన్డీఏ ప్రభుత్వం వాలంటీర్లకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లను పంపిణీ చేయించాలని టి.జి భరత్ పేర్కొన్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ల విషయంలో రాజకీయాలు చేయడం మంచి పద్దతి కాదని చెప్పారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ. 2 వేలకు పెంచినట్లు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 4 వేలు పింఛన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో రాజకీయాలు చేయడం కరెక్టు కాదన్నారు.