టిడిపితోనే ప్రజల జీవితల్లో వెలుగు.. టిడిపి నేతలు
1 min readకొత్తపేటలో నగరమా మేలుకో కార్యక్రమం చేపట్టిన టిడిపి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమాన్ని గురువారం నగరంలోని 51 వ వార్డు కొత్తపేటలో చేపట్టారు. టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు, కార్యకర్తలు వీధుల్లోని ఇల్లు, దుకాణాల వద్దకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ ప్రభుత్వంలో నిత్యవసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, పన్నులు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఎలాంటి అభివ్రుద్ది జరగలేదని.. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కర్నూల్లో టి.జి భరత్ ఎమ్మెల్యే అయితే డెవలప్మెంట్ ఉంటుందన్నారు. కర్నూలు ప్రజల సమస్యలు తీరి.. స్థానికంగా పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు రావాలంటే టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు టిడిపి నేతలు బొల్లెద్దుల రామకృష్ణ, గణేష్, పాల్ రాజ్, శ్రీనివాసులు, రాధ, విశ్వనాథ్, భరత్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.