వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాల పోటీ !
1 min read
పల్లెవెలుగువెబ్ : వచ్చే ఎన్నికల్లో వైసీపీను ఓడించేందుకు టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేయనున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ అహమ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. వైకాపా పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అసమర్థ, అరాచక పాలన సాగిస్తోందని షరీఫ్ విమర్శించారు.