టీడీపీ కోడుమూరు అధికార ప్రతినిధిగా పి. విజయ్ కుమార్ నియామకం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ అధికార ప్రతినిధిగా పి. విజయ్ కుమార్ను నియమించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కోడుమూరు అసెంబ్లి ఇంచార్జి ఆకేపోగు ప్రభాకర్ నియమించినట్లు విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లును జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవిని అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాంబాబు, పోతురాజు రవికుమార్, కొరకంచి రవికుమార్, సత్రం రామక్రిష్ణుడు, పేరపోగు రాజు, హనుమంతరావు చౌదరి, అడ్వకేట్ ప్రసాద్, ఎల్లప్ప మొదలగు వారు పాల్గొన్నారు.