PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవకాశం వస్తే…టీడీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి…

1 min read

ప్రజా వైద్యుడిగా గుర్తింపు…

  • రాష్ట్ర స్థాయిలో అవార్డులు… కేంద్రం నుంచి ప్రశంసలు పొందిన వైద్యశాలి..
  • కర్నూలు ఎంపీ టిక్కెట్​… బీసీలకే ఇవ్వాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత
  • సర్వేల మీద సర్వేలు చేయిస్తున్న వైనం..
  • టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే… రాజకీయ రంగ ప్రవేశం…?
  • 25 ఏళ్లుగా వైద్య సేవ చేశా…
  • అవకాశం వస్తే…ప్రత్యక్ష రాజకీయాల్లోకి…
  • ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రిటైర్డు సూపరింటెండెంట్​, సీనియర్​ కార్డియాలజిస్ట్​,

హార్ట్​ అండ్​ బ్రెయిన్​ మల్టీ సూపర్​ స్పెషాలిటీ అధినేత డాక్టర్​ చంద్రశేఖర్​

వైద్య సేవే పరమావధిగా… ఆస్పత్రే దేవాలయంగా …. రోగులే దేవుళ్లుగా భావించి …. 25 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తూ… సక్సెస్​ ఫుల్​ డాక్టరుగా పేరుగాంచిన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సీనియర్​ గుండె వైద్య నిపుణులు డా. చంద్రశేఖర్​…. రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్​, మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​, సీనియర్​ కార్డియాలజిగా ప్రజలకు విశేష  వైద్య సేవలు అందించిన డా. చంద్రశేఖర్​ … గతేడాది పదవీ విరమణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే… కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు.

పల్లెవెలుగు, కర్నూలు: వైద్య విద్యాభ్యాసంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన డా. చంద్రశేఖర్​… ప్రభుత్వ వైద్యుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ … ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో దాదాపు 25 ఏళ్లుగా వైద్య సేవలు అందించి మంచి పేరు సంపాదించారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​గా, మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​గా, సీనియర్​ కార్డియాలజిస్ట్​గా, అడిషనల్​ డీఎంఈగా … ఇలా ఎన్నో ఉన్నత పదవులను … స్వీకరించిన డా. చంద్రశేఖర్​ కు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో ఎంతో మంచి పేరు ఉందని చెప్పవచ్చు.

హాస్పిటల్​లో​…అభివృద్ధి ఫలాలు..:

1997లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో  అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా విధులు స్వీకరించిన నాటి నుంచి ఆస్పత్రిలో అభివృద్ధి పరుగులు తీసింది. నిత్యం ఆస్పత్రి అభివృద్ధి వైపు ఆలోచించే డా. చంద్రశేఖర్​… 2000వ సంవత్సరంలో ఐసీసీయూను మంజూరు చేయించారు. ఇప్పటికీ ఆ విభాగం సక్సెస్​ ఫుల్​గా నడుస్తోంది. అంతేకాక ఆ విభాగంలోనే క్యాథలాక్​ యూనిట్​ ఏర్పాటు చేసి.. రోగులకు యాంజియోగ్రామ్​లు, యాంజియో ప్లాస్లిలు స్టంట్స్​ వేశారు. అదేవిధంగా శిథిలమై… మూలనపడిన కార్డియో థెరాసిక్​ విభాగాన్ని  పున: ప్రారంభించారు. ప్రస్తుతం అందులో గుండె శస్ర్తచికిత్సలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

మహానుభావుల స్ఫూర్తితో…:

వైద్యరంగంలోని వివిధ శాస్ర్తవేత్తలను… భావితరాల వైద్య విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని…. స్మరించుకోవాలన్న ఉద్దేశ్యంతో కర్నూలు సర్వజన ఆస్పత్రి, మెడికల్​ కళాశాలలో దాదాపు 20 కి పైగా విగ్రహాలను ఆవిష్కరింపజేశారు. 2020లో  రాష్ట్ర గవర్నర్​ విశ్వభూషణ్​ చేతుల మీదుగా డా. అబ్దుల్​ కలాం విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఆ తరువాత  డా. చంద్రశేఖర్​ను రాష్ట్ర గవర్నర్​ అభినందించారు.

సేవకు గుర్తింపు… గోల్డ్ మెడల్​…:

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులోని  ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 25 ఏళ్లుగా రోగులకు విశిష్ట సేవలు అందించిన కార్డియాలజిస్ట్​ , అడిషనల్​ డీఎంఈ డా. చంద్రశేఖర్​కు అరుదైన గౌరవం దక్కింది. 2019లో  కర్నూలు జిల్లా ఇండియన్​ రెడ్​ క్రాస్​ సొసైటీలో అత్యధికంగా మెంబర్స్​ ను చేర్పించడం.. యువతతో రక్తదానం చేయించడం… అవగాహన కల్పించడం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో సఫలమైన డా. చంద్రశేఖర్​కు బంగారు పతకం వరించింది.  సేవలకు గుర్తింపుగా గవర్నర్​ ఆఫీస్​ రాజభవన్​ దర్బార్​ హాల్​ నందు ప్రభుత్వ వైద్యశాల కార్డియాలజిస్ట్​, అడిషనల్​ డీఎంఈ డా.పి. చంద్రశేఖర్​ .. రాష్ట్ర గవర్నర్​  విశ్వభూషణ్​ హరిచందన్​ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు.

లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​… అవార్డు గ్రహిత..:

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గుండె హృద్రోగులకు విశేష సేవలు అందించి.. వేలాది మంది ప్రాణాలు కాపాడిన సీనియర్​ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​  2023 జూన్​ 22న  ఏపీ కార్డియాలజికల్​ సొసైటీ వారు లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డు అందించారు.

డాక్టర్లకు…ఆదర్శం..:

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో 25 ఏళ్లుగా గుండె వైద్యనిపుణులుగా పని చేసి.. లక్షల మందికి ప్రాణదాతగా నిలిచిన  కార్డియాలజిస్ట్​, అడిషనల్​ డీఎంఈ డా. పి. చంద్రశేఖర్​ను జూనియర్​, సీనియర్​ వైద్యులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనహృదయాలను అర్థం చేసుకుని..వైద్యచికిత్సలు అందించే మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. రాయలసీమలోనే కాక తెలంగాణలోని మహబూబ్​నగర్​ , కర్ణాటకలోని రాయచూరు జిల్లా వాసుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో సందేహం లేదు.

సేవకు… బానిస..:

నిస్వార్థపరుడు… నిగర్వి…విద్యావంతుడు… వైద్యవృత్తిలో విజయవంతమైన గుండె వైద్య నిపుణుడిగా పేరుగాంచిన డా. చంద్రశేఖర్​ సేవకు మాత్రం బానిసయ్యారు. వైద్య సేవల కోసం.. గుండె హృద్రోగ సమస్యలతో వచ్చే .. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ .. కార్పొరేట్​ స్థాయిలో వైద్య సేవలు అందించారు.  అదేవిధంగా కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మెడికల్​ విద్యార్థులకు వివిధ వ్యాధులకు సంబంధించి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.

ఓ మంత్రి… కక్ష సాధింపు…!

ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​గా విధులు నిర్వహిస్తున్న సమయంలో… వందల కోట్ల రూపాయలతో వివిధ భవనాలను నిర్మించిన ఘనత డా. చంద్రశేఖర్​కే దక్కింది. ఆస్పత్రి అభివృద్ధి అంటే ఆయన హయాంలోనే  జరిగింది. అది చూసి ఓర్వలేని ఓ సామాజిక వర్గానికి చెందిన వారు వైసీపీ నేతలను ఆశ్రయించి.. తనను ఇరకాటంలో పెట్టారు. తనపై టీటీపీ ముద్ర వేసి.. తన ఉద్యోగ రీత్యా ఇబ్బందులు పెట్టారు. పదోన్నతులు ఆపారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి తనపై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని బహిరంగంగానే ఆరోపించారు డా. చంద్రశేఖర్​.

 రాజకీయ అరంగేట్రం…:

వైద్య వృత్తిలో ఎంతో మంచి పేరు సంపాదించిన డా. చంద్రశేఖర్​… రాష్ట్ర స్థాయిలో అవార్డులు.. కేంద్రం నుంచి ప్రశంసలు కూడా పొందారు. 2023 ఆగస్టు 31న  ఆయన పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ తరువాత కూడా ఆయన హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మెడికల్​ విద్యార్థులకు వివిధ వ్యాధులపై సంబంధిత వైద్యులతో అవగాహన సదస్సు నిర్వహిస్తూనే ఉన్నారు. సీనియర్​, జూనియర్​ వైద్యులతోపాటు మెడికల్​ విద్యార్థులందరూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తనకు టీడీపీ అధిష్ఠానం ఆదేశిస్తే… కర్నూలు ఎంపీ బరిలో నిలిచి… గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు.

బీసీలకే… ఎంపీ టిక్కెట్​…:

టీడీపీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా రాయలసీమలో బీసీలకే పెద్దపీఠ వేస్తానని మాట ఇచ్చారు. అందులో భాగంగానే కర్నూలు, నంద్యాల జిల్లాల పార్లమెంట్​ అధ్యక్షులుగా బీసీలనే కూర్చోబెట్టారు. ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గంలోనూ వీలైనంత వరకు బీసీలకే అవకాశం కల్పిస్తానని భరోసా కల్పించారు. ప్రస్తుతం బీజేపీ–జనసేన– టీడీపీ కూటమిలో భాగంగా ఎంపీ టిక్కెట్​ టీడీపీ అభ్యర్థికే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో  ఎంపీ టిక్కెట్​ ఆశించే వారంతా … టీడీపీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ధన, జన బలంతోపాటు విద్యావంతులకే ఎంపీ టిక్కెట్​ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్వేల మీద సర్వేలు కొనసాగుతున్నాయి. ప్రజా అభిష్టం  మేరకు ఎంపీ టిక్కెట్​ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంసిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

About Author